Horse | మద్యం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ గుర్రం..
Horse | మద్యం( Alcohol ) స్మగ్లింగ్ చేస్తూ ఓ గుర్రం( Horse ) పట్టుబడింది. ఇక ఆ గుర్రాన్ని పోలీసులు ఠాణాకు( Police Station ) తరలించారు. ఈ ఘటన బీహార్( Bihar )లోని వెస్ట్ చంపారన్( West Champaran ) జిల్లాలో వెలుగు చూసింది.

Horse | బీహార్( Bihar ) రాష్ట్రంలో మద్యపాన నిషేధం( Alcohol Ban ) కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్మగ్లర్లు మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వాహనాల ద్వారా మద్యం అక్రమంగా తరలిస్తూ పట్టుబడి పోతుండడంతో స్మగ్లర్లు కొత్త మార్గాలను ఎంచుకున్నారు.
పొరుగు రాష్ట్రాల నుంచి గుర్రాల ద్వారా మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన పోలీసులు.. అటవీ ప్రాంతాల్లో కూడా నిఘా పెంచారు. అటవీ ప్రాంతాలు, వ్యవసాయ పొలాల మీదుగా గుర్రాల ద్వారా మద్యాన్ని తరలిస్తున్న స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.
నౌతన్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ నెల 27వ తేదీన తెల్లవారుజామున 3 గంటలకు ఓ గుర్రం( Horse )పై 50 లీటర్ల మద్యాన్ని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దీంతో అప్రమత్తమైన స్మగ్లర్ అక్కడ్నుంచి పారిపోగా, గుర్రాన్ని పోలీసులు ఠాణాకు తరలించారు. 50 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు.
ఈ మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని రాంబాబు పాశ్వాన్గా గుర్తించాం.. త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, యూపీ నుంచి మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. గుర్రాల ద్వారా చాలా మంది ఈ దందాకు పాల్పడుతున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.