Husband Suicide | భార్య వివాహేతర సంబంధం.. పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త
Husband Suicide | ఓ వివాహిత( Married Woman ) తన ప్రియుడి( Lover )తో వివాహేతర సంబంధం కొనసాగించడంతో భర్త( Husband ) తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో తన ఇద్దరు మగపిల్లలకు విషమిచ్చి చంపేశాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు.

Husband Suicide | అహ్మదాబాద్ : ఓ వివాహిత( Married Woman ) తన ప్రియుడి( Lover )తో వివాహేతర సంబంధం కొనసాగించడంతో భర్త( Husband ) తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో తన ఇద్దరు మగపిల్లలకు విషమిచ్చి చంపేశాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుజరాత్( Gujarat )లోని సూరత్ సిటీ( Surat City )లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. సూరత్ సిటీకి చెందిన అల్పేశ్‌భాయ్ వృత్తిరీత్యా టీచర్. ఆయన భార్య జిల్లా పంచాయతీ ఆఫీసులో కర్ల్క్‌గా పని చేస్తోంది. వీరికి 7, 2 ఏండ్ల వయసున్న ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. అయితే భార్య తన ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ, భర్త పిల్లలను నిర్లక్ష్యం చేస్తుంది. ఇది అల్పేశ్ భాయ్‌కు నచ్చలేదు.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అల్పేశ్ భాయ్ ఇద్దరు మగ పిల్లలకు విషమిచ్చి చంపేశాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై అల్పేశ్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా అల్పేశ్ నివాసంలో దొరికిన రెండు డైరీలను స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో నాలుగైదు పేజీల సూసైడ్ నోట్ లభ్యమైంది. ఇక రెండు డైరీల్లో ఒక డైరీలో మొత్తం తన భార్య గురించే రాసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో అల్పేశ్ భార్యను పోలీసులు అరెస్టు చేశారు.