ఐఎండీ నుంచి ఒక వేడి వార్త‌.. మ‌రో చ‌ల్ల‌ని క‌బురు!

  • Publish Date - November 1, 2023 / 06:31 AM IST
  • న‌వంబ‌ర్‌లోనూ మంట‌లే!


న్యూఢిల్లీ: న‌వంబ‌ర్ వ‌చ్చేసింది.. ఇక ఎండ‌లు ఉండ‌వు.. చ‌లే.. అని సంబుర‌ప‌డుతున్నారా? ఐఎండీ మాత్రం అంత ఆనంద‌ప‌డేది ఏమీ లేద‌ని తేల్చేసింది. ఈ న‌వంబ‌ర్‌లో సాధార‌ణ స్థాయికి మించి ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యే అవ‌కాశం ఉన్న‌ద‌ని బాంబు పేల్చింది. మంగ‌ళ‌వారం ఐఎండీ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ మృత్యుంజ్ మ‌హాపాత్ర మీడియాతో మాట్లాడుతూ.. ఎల్ నినో ప‌రిస్థితులు క్ర‌మేపీ బ‌ల‌ప‌డుతున్న నేప‌థ్యంలో న‌వంబ‌ర్‌లో స‌గ‌టు వ‌ర్ష‌పాతం సాధార‌ణ స్థాయిలోనే ఉంటుంద‌ని తెలిపారు.


ప్ర‌త్యేకించి ద‌క్షిణాదిలోని ద్వీప‌క‌ల్ప ప్రాంతాలు, దేశ‌ వాయ్య‌వ్య, తూర్పు మ‌ధ్య‌, ఈశాన్య ప్రాంతాల్లో సాధార‌ణానికి మించి వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ద‌ని వెల్ల‌డించారు. అదే స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు, రైతుల‌కు శుభావ‌ర్త చెప్పిన మ‌హాపాత్ర‌.. వచ్చే రుతుపవన సీజన్ నాటికి ఎల్ నినో ప‌రిస్థితులు కొన‌సాగ‌క‌పోవ‌చ్చ‌ని న‌మూనాలు పేర్కొంటున్నాయ‌ని తెలిపారు.