Snake Festival | దేశంలోనే అతిపెద్ద పాముల జాతర..చూసేందుకే భయం

Snake Festival | దేశంలోనే అతిపెద్ద పాముల జాతర..చూసేందుకే భయం

Snake Festival | విధాత : దేవుళ్లకు జాతరలు ఉన్నట్లుగానే పాములకు కూడా ఓ జాతర ఉంది. ఈ జాతరలో వేలాది పాములను చేతులతో, నోటితో పట్టుకుని భక్తులు ఊరేగింపుగా సాగే తీరు చూసేందుకు భయం గొల్పుతుంది. ఏటా దేశంలోని బిహార్ (Bihar) రాష్ట్రంలో సమస్తిపూర్ (Samastipur) జిల్లా విభూతిపూర్ (Vibhutipur) పట్టణం సింథియా ఘట్ (Sindhiya Ghat) వద్ద నాగపంచమి రోజున నిర్వహించే పాముల జాతర ఎంతో ప్రసిద్ధ పొందింది. ఈ జాతరలో ప్రజలు బతికి ఉన్న విష సర్పాలను మెడలో వేసుకుని, నోటితో పట్టుకుని ఊరేగింపుగా తిరుగుతారు. ఈ ప్రాంతంతో పాటు అనేక రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు ఈ ఊరేగింపులో పాల్గొంటుంటారు. ప్రస్తుతం ఈ జాతరకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

నాగపంచమి రోజున జరుపుకునే ఈ జాతర సమస్తిపూర్ లో ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమంగా భావిస్తారు. ఈ సందర్బంగా జరిగే సర్ప దేవతలకు నిర్వహించే సంప్రదాయ ప్రార్థనలతో నాగ దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయని, కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు. ప్రతి ఒక్కరూ మెడలో పాములను దండల మాదిరిగా చుట్టుకుని నడుస్తూ, పాముకాటు, విషం నుండి రక్షణకు సంబంధించిన దేవత విశారి అమ్మవారికి ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈ నాగ పంచమి జాతర శతాబ్ధాల నుంచి ఇక్కడ కొనసాగుండటం విశేషం.

వన్యప్రాణుల ప్రేమికులు, సంరక్షులు మాత్రం ఈ జాతరపై తమ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జాతర పేరుతో పాములను హింసిస్తున్నారని..వేలాది పాములు జీవహింసకు గురువుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు.