విధాత: ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ అలెర్ట్‌ను జారీ చేసింది. రైలు ప్రయాణ సమయంలో అనధికారిక ఫుడ్ డెలివరీ యాప్స్‌తో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రయాణికులకు ఆరోగ్యమైన భోజనాన్ని అందించేందుకు భారతీయ రైల్వే తీసుకొచ్చిన ప్లాట్‌ఫామ్‌ల వివరాలతో పాటు అనధికారిక ఫుడ్ డెలివరీలు అందిస్తున్న వెబ్‌సైట్స్‌తో పాటు యాప్స్ వివరాలను రైల్వే ట్విట్టర్ ద్వారా వివరించింది.
రైల్‌రెస్ట్రో, రైలుమిత్ర, ట్రావెల్‌ఖానా, రైల్ మీల్, దిబ్రెయిల్, ఖానాఆన్‌లైన్, ట్రైన్స్ కేఫ్, ఫుడ్ ఆన్ ట్రాక్, ఈ-కేటరింగ్, ట్రైన్ మెనూ తదితర వెబ్‌సైట్స్, యాప్స్ ద్వారా జర్నీ సమయంలో ఫుడ్‌ను ఆర్డర్ చేయొద్దని సూచించింది. అయితే, రైలులో ఆహారం సమయంలో ఆహారం ఆర్డర్ చేసుకునేందుకు ఐఆర్‌సీటీసీ తీసుకువచ్చిన ఈ-కేటరింగ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి వివరాలు, స్టేషన్ వివరాలను ఎంటర్ చేయాలని, ఆ తర్వాత పీఎన్‌ఆర్ ఎంటర్ చేసిన తర్వాత నచ్చిన ఫుడ్‌ను ఎంపిక చేసుకోవచ్చని పేర్కొంది.
పే ఆన్‌లైన్, క్యాష్ ఆన్ డెలివరీలో మీకు నచ్చిన ఆప్షన్‌ను ఎంచుకోవచ్చని.. అంతేకాకుండా ఫుడ్ ఆన్ ట్రాక్ యాప్ ద్వారా ఆర్డర్ పెట్టవచ్చని తెలిపింది. వీలుకాకపోతే 1323 నెంబర్, లేదంటే 8750001323 వాట్సాప్ నంబర్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చని ఐఆర్‌సీటీసీ వివరించింది. వాస్తవానికి ఐఆర్‌సీటీసీ 2014లోనే ఈ-కేటరింగ్ సర్వీసులను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 300పైగా రైల్వే స్టేషన్లలో సేవలను అందిస్తున్నాయి. ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ సేవలను వినియోగించుకోవాలని కోరింది.