అంత్జరాతీయ షాపింగ్ అనుభవం..! బడా లగ్జరీ మాల్‌ను నేడు ముంబయిలో ప్రారంభించనున్న రిలయన్స్..!

దేశీయ ప్రముఖ కంపెనీ రిలయన్స్ రిటైల్ దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరంలో ‘జియో వరల్డ్ ప్లాజా’ పేరుతో లగ్జరీ షాపింగ్‌ను ప్రారంభించనున్నది. ఈ ప్లాజాను బుధవారం ప్రారంభించనున్నారు. ఈ ప్లాజాలో టాప్ టూ ఎండ్ రిటైల్ ఫ్యాన్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్స్‌పీరియన్స్ సైతం వినియోగదారులకు లభించనున్నది. ఈ ప్లాజాను ముంబయి బీకేసీలో రియల్స్ ఏర్పాటు చేసింది. ఈ ప్లాజా ఈ ప్లాజా కల్చరల్ సెంటర్, జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్, జియో వరల్డ్ గార్డెన్‌లకు అనుసంధానం చేసి ఉండనున్నది.
మాల్ ప్రారంభోత్సవం నేపథ్యంలో కంపెనీ డైరెక్టర్ ఈషా అంబానీ మాట్లాడుతూ.. ప్రపంచంలోని అత్యుత్తమ బ్రాండ్లను భారత్‌కు తీసుకురావడంతో పాటు టాప్ ఇండియన్స్ గొప్పదాన్ని చాటడమే లక్ష్యమన్నారు. కస్టమర్లకు స్పెషల్ అనుభవంతో పాటు వారి అభిరుచులకు తగ్గట్లుగా తాము చేపట్టే ప్రయత్నంలో ముందుకు నడిపించడంలో సహాయపడుతుందన్నారు. ఇదిలా ఉండగా.. ప్లాజాలో రిటైర్ దుకాణాలతో పాటు విశ్రాంతి, ఫుడ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దాదాపు 7.50లక్షల చదరపు అడుగుల స్థలంలో నాలుగు అంతస్తుల్లో విస్తరించి మాల్ విస్తరించి ఉంటుంది.

ఈ సెంటర్‌లో ఒకే రూఫ్ కింద 66 లగ్జరీ బ్రాండ్‌లు ఉండనున్నాయి. భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్ సైతం ఉన్నాయి. ఇందులో బాలెన్సియాగా, జార్జియో అర్మానీ కేఫ్, పోటరీ బార్న్ కిడ్స్, సామ్‌సాంగ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, ఈఎల్‌అండ్‌ఎన్ కేఫ్, రిమోవా, వాలెంటినో, టోరీబర్చ్, వైఎస్‌ఎల్, వెర్సేస్, టిఫనీ, లాడూరి తదితర కంపెనీలున్నాయి. లూయిస్ విట్టన్, గూచీ, కార్టియర్, బెయిలీ, డియోర్, బల్గారి తదితర బ్రాండ్స్ ఉన్నాయి. అలాగే మనీష్ మల్హోత్రా, అబు జానీ సందీప్ ఖోస్లా, రాహుల్ మిశ్రా, రీతూ కుమార్‌తో పాటు పలువురు డిజైనర్ల దుస్తులు సైతం ఈ ప్లాజాలో అందుబాటులో ఉంటాయి.