14న ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం..! భారత్‌లో కనిపిస్తుందా..?

  • Publish Date - October 26, 2023 / 04:34 AM IST

ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం ఖగోళ ప్రియులను అలరించబోతున్నది. ఈ నెల 28-29 మధ్య అర్ధరాత్రి 1.06 గంటల నుంచి 2.24 గంటల మధ్య ఏర్పడనున్నది. ఈ సారి పాక్షిక చంద్రగ్రహణం కనిపించనున్నది. ఈ నెలలో ఏర్పడనున్న రెండో గ్రహణం కావడం విశేషం. ఈ నెల 14న ఏర్పడిన విషయం తెలిసిందే. సూర్యగ్రహణం పూర్తయిన పక్షం రోజుల్లోనే చంద్రగ్రహణం ఏర్పడుతుండడం అరుదైన విషయమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.


ఈ ఏడాది రెండు సూర్యగ్రహణాలు.. రెండు చంద్రగ్రహణాలు ఉండగా.. ఇందులో చివరి చంద్రగ్రహణం కనిపించబోతున్నది. వాస్తవానికి చంద్రుడు, సూర్యుడి మధ్యలో భూమి ఉన్నప్పుడు చంద్రగ్రహణం ఆవిష్కృతమవుతుంది. సూర్య కిరణాల కారణంగా భూమి నీడ చంద్రుడి ఉపరీతలంపై పడుతుంది. ఫలితంగా కాంతి తగ్గుతుంది. ఫలితంగా చంద్రుడు కొంతసేపు కనిపించకుండాపోతాడు. అయితే, ఈ సారి ఏర్పడబోతున్న గ్రహణం పాక్షిక చంద్రగ్రహణం, పౌర్ణమి చంద్రుడు, సూర్యుడి మధ్యలోకి భూమి వస్తే ఇలా జరుగుతుంది. పశ్చిమ పసిఫిక్​ సముద్రం, ఆస్ట్రేలియా, ఆసియా, యరోప్​, ఆఫ్రికా, తూర్పు దక్షిణ అమెరికా, ఉత్తర- తూర్పు నార్త్​ అమెరికా, అట్లాటింక్​ సముద్రం, హిందూ మహా సముద్రం, దక్షిణ పెసిఫిక్​ సముద్రంలోని ప్రాంతాల్లో గ్రహణం కనిపిస్తుంది.


అలాగే భారత్‌లోనూ కనిపిస్తుంది. భారత కాలమానం ప్రకారం.. 28న అర్ధరాత్రి 1.05 గంటలకు మొదలై.. 29న ఉదయం 2.24 గంటల వరకు కొనసాగుతుంది. 1.19 గంటల పాటు గ్రహణం కనువిందు చేయనున్నది. ఇక వచ్చే ఏడాది ఐదు గ్రహణాలు కనువిందు చేయనున్నాయి. ఇందులో రెండు, మూడు చంద్రగ్రహణాలున్నాయి. మార్చిలో పెనుంబ్రల్‌, సెప్టెంబర్‌లో పాక్షిక, అక్టోబర్‌లో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్నాయి. ఇక భారత్‌లో చివరిసారిగా నవంబర్‌ 8, 2022న సంపూర్ణ చంద్రగ్రహనం దర్శనమిచ్చింది.