విధాత : ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్స్ అమ్మకాలపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లల ఆరోగ్యానికి ప్రమాదరం అవుతున్నాయన్న ఆందోళనలతో మహారాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు 500 మీటర్ల పరిధిలో స్టింగ్ ఎనర్జీ డ్రింక్ అమ్మకాన్ని నిషేధిస్తూ అసెంబ్లీలో నిర్ణయం తీసుకుంది.
‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ లోని కొన్ని పదార్థాలు పిల్లలకు హాని చేస్తాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఎనర్జీ డ్రింక్స్‌తో జరిగే చేటు గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి నర్‌హరి జిర్వాల్ అధికారులను ఆదేశించారు. ఎనర్జీ డ్రింక్స్‌లో కెఫీన్, చక్కెర అధికంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
