విధాత: మణిపూర్‌లో వాంగూ లైఫామ్ ప్రాంతంలో ప్రత్యేక పోలీసులు బలగాలు నిర్వహించిన సోదాల్లో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి పట్టుబడింది. మంగళవారం సాయంత్రం 3.30 నుంచి 7.30 గంటల మధ్య ఇండ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆయుదాలు, మందు సామగ్రిని స్వాధీనం పర్చుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆపరేషన్ సమయంలో వాంగూ లైఫాం చింగ్యాలోని చాలా ఇండ్లను క్షుణ్ణంగా శోధించారు వాంగూ లైఫాం మాన్య కొండ శ్రేణిలోని అనుమానిత ప్రాంతాలను కూడా తనికీ చేశారు. స్మశానవాటిక సమీపంలోని వాంగూ లైఫామ్ మంగ్యా వద్ద కొండ కింద కొన్ని ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో ఒక ఏకే 47, ఐదు ఎస్‌ఎల్‌ఆర్, ఒకటి 303 రైఫిల్ (మాడిఫైడ్), ఒక ఇన్సాస్ రైఫిల్, మూడు 303 రైఫిల్, రెండు ఎస్‌బీబీఎల్, 11 హెచ్‌సీ గ్రెనేడ్‌లు, ఒక చైనీస్ హ్యాండ్ గ్రెనేడ్, మూడు డబ్ల్యూపీ గ్రెన్ ఎంకె ఐ, 15 గ్రెనేడ్ లాంచింగ్ ట్యూబ్ ఉన్నాయి. ఫ్యూజ్, ఆరు డిటోనేటర్లు, రెండు డిటోనేటర్ బాక్స్, ఆరు బాలిస్టిక్ కాట్రిడ్జ్‌లు, 12 బోర్ల మూడు ఖాళీ కేసులు, ఒక BP వెస్ట్, రెండు వాకీ టాకీ (బాయోఫెంగ్), ఒక ఖాళీ AK-47 మ్యాగజైన్, ఒక ఖాళీ ఇన్సాస్ రైఫిల్ మ్యాగజైన్, నాలుగు ఖాళీ 303 రైఫిల్ మ్యాగజైన్, ఐదు ఖాళీ ఎస్ఎల్ఆర్ రైఫిల్ మ్యాగజైన్, స్థానికంగా తయారు చేసిన పైప్ బాంబు ఉన్నాయి. స్వాధీనం చేసుకున్న వస్తువులను సంఘటన స్థలం నుంచి స్వాధీనం చేసుకొన్నట్టు అధికారులు తెలిపారు.