నెహ్రూకు ప్ర‌ముఖుల నివాళి..

భార‌తదేశ తొలి ప్ర‌ధానిమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా మంగ‌ళ‌వారం ప‌లువురు ప్ర‌ముఖులు ఆయ‌న‌కు నివాళులు అర్పించారు.

  • Publish Date - November 14, 2023 / 06:05 AM IST
  • మోదీ, సోనియా, రాహుల్ ఖ‌ర్గే ఘ‌నంగా పుష్పాంజ‌లి

విధాత‌: భార‌తదేశ తొలి ప్ర‌ధానిమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా మంగ‌ళ‌వారం ప‌లువురు ప్ర‌ముఖులు ఆయ‌న‌కు నివాళులు అర్పించారు. ప్ర‌ధాని మోదీతోపాటు కాంగ్రెస్ నేత‌లు సోనియాగాంధీ, ఖ‌ర్గే, రాహుల్‌గాంధీ త‌దిత‌రులు ఆయ‌న‌కు అంజ‌లి ఘ‌టించారు. దేశ రాజధానిలోని శాంతివన్‌లో నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ‌ తొలి ప్ర‌ధాన‌మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌నకు నివాళుల‌ర్పిస్తున్న‌ట్టు ప్రధాని మోదీ మంగ‌ళ‌వారం ట్విట్ట‌ర్‌లో తెలిపారు.

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు నివాళులర్పించారు.

పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ స్వేచ్ఛ, పురోగతి, న్యాయానికి ప్ర‌తీక అని పేర్కొన్నారు. “ఈ రోజు భారతమాతకు ఈ ‘జవహర్ ఆఫ్ హింద్’ విలువలు అవసరమ‌ని రాహుల్ ట్విట్టర్ లో తెలిపారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ఢిల్లీలోని శాంతివనంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆధునిక భారతదేశానికి రూపశిల్పిగా నెహ్రూ కీలక పాత్ర పోషించార‌ని మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు.