కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో భారీ అగ్ని ప్రమాదం

  • Publish Date - October 25, 2023 / 06:55 AM IST
  • రసాయనాలు నింపిన 60కిపైగా ట్యాంకర్లు దగ్ధం
  • గుజరాత్‌లోని ఆరావ‌ళి జిల్లాలో దుర్ఘ‌ట‌న‌
  • సోష‌ల్ మీడియాలో వైరల్‌గా ద‌ట్ట‌మైన పొగ‌ దృశ్యాలు



విధాత‌: గుజరాత్‌లోని ఆరావళి జిల్లాలో ఉన్న‌ ఓ కెమికల్ ఫ్యాక్టరీలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న‌ది. ఫ్యాక్ట‌రీలో ఆవ‌ర‌ణ‌లో ఉన్న రసాయ‌నాలు నింపిన 60కిపైగా ట్యాంకర్లు దగ్ధమ‌య్యాయి. ఆ ప్రాంతంలో ద‌ట్ట‌మైన‌ పొగలు కమ్ముకున్న, భారీగా మంట‌లు చెల‌రేగుతున్న‌ దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.


మంటలను ఆర్పేందుకు దాదాపు 10 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అగ్నిప్రమాదం వెనుక కారణం ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని ప్ర‌జ‌లు ఎవ‌రూ ఆ ప్రాంతానికి రాకుండా చ‌ర్య‌లు చేప‌ట్టారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉన్న‌ది.