మిజోరం కాంగ్రెస్ జాబితా విడుద‌ల‌

మిజోరం అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీచేయ‌బోయే అభ్య‌ర్థుల పేర్ల‌ను కాంగ్రెస్ ప్ర‌క‌టించింది. ట్విట్ట‌ర్ ఖాతాలో 39 మంది పేర్ల‌తో కూడి జాబితాను విడుద‌ల చేసింది

మిజోరం కాంగ్రెస్ జాబితా విడుద‌ల‌

ఐజ్వాల్‌: మిజోరం అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీచేయ‌బోయే అభ్య‌ర్థుల పేర్ల‌ను కాంగ్రెస్ ప్ర‌క‌టించింది. సోమ‌వారం మ‌ధ్య త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో 39 మంది పేర్ల‌తో కూడి జాబితాను విడుద‌ల చేసింది. మంగ‌ళ‌వారం మిజోరంలో త‌న ప‌ర్య‌ట‌న ముగించుకుని వెళ్లే ముందు ఆ పార్టీ నేత రాహుల్‌గాంధీ ఐజ్వాల్ క్ల‌బ్‌లో రాష్ట్ర నేత‌ల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం కానున్నారు. ఈ సంద‌ర్భంగా మీడియా స‌మావేశంలోనూ పాల్గొన‌నున్నారు. రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటిస్తున్న సమయంలోనే మిజోరంలో 40 సీట్లకు గాను 39 మంది అభ్యర్థుల పేర్లను పార్టీ విడుదల చేసింది. ఇక్క‌డ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో మిజోరం సెక్యుల‌ర్ కూట‌మిని ఏర్పాటు చేశారు. ఇందులో కాంగ్రెస్‌తోపాటు.. పీపుల్స్ కాన్ఫరెన్స్, జోరం నేషనలిష్టు పార్టీ ఉన్నాయి.