విధాత : త్రిపుర గవర్నర్‌గా నియామితులైన నల్లు ఇంద్రసేనారెడ్డి గురువారం తన బాధ్యతలు స్వీకరించారు. గవర్నర్‌గా నల్లు బాధ్యతల స్వీకరణ ద్వారా తెలంగాణ నుంచి ప్రస్తుతం హిమాచల్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తర్వాతా మరో బీజేపీ నేత గవర్నర్‌గా కొనసాగబోతున్నారు. అంతకుముందు తెలంగాణ నుంచి రామారావు, విద్యాసాగర్‌రావులు కూడా గవర్నర్‌గా పనిచేశారు.