3,4 తేదీల్లో మిజోరం పర్యటనకు ప్రియాంక
ప్రియాంక గాంధీ సహా కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు నవంబర్ 3, 4 తేదీల్లో మిజోరంలో విసృతంగా పర్యటించనున్నారు.

ఐజ్వాల్ : ప్రియాంక గాంధీ సహా కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు నవంబర్ 3, 4 తేదీల్లో మిజోరంలో విసృతంగా పర్యటించనున్నారు. ప్రియాంకతోపాటు సీనియర్ నేతలు జైరాం రమేశ్, శశిథరూర్ సైతం పలు ఎన్నికల సభల్లో ప్రసంగించనున్నారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ మీడియా సెల్ చైర్మన్ లాల్ రే మృతలై విలేకరుల సమావేశంలో చెప్పారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎన్నికల ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే ప్రియాంక, తదితర నేతలు వస్తున్నారని చెప్పారు.