పాకిస్తాన్‌ నుంచి తిరిగి స్వదేశానికి.. మనసు మార్చుకున్న అంజూ

ఇద్దరు పిల్లలను వదిలి ఫెస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తి కోసం ఏకంగా పాకిస్తాన్‌ వెళ్లి ప్రియుడిని పెళ్లి చేసుకున్న మధ్యప్రదేశ్‌కు చెందిన అంజూ తిరిగి స్వదేశానికి చేరింది

పాకిస్తాన్‌ నుంచి తిరిగి స్వదేశానికి.. మనసు మార్చుకున్న అంజూ

విధాత : తన భర్తను,ఇద్దరు పిల్లలను వదిలి ఫెస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తి కోసం ఏకంగా పాకిస్తాన్‌ వెళ్లి ప్రియుడిని పెళ్లి చేసుకున్న రాజస్థాన్ కు చెందిన అంజూ తిరిగి స్వదేశానికి చేరింది. రాజస్థాన్లోని ఆల్వార్ కి చెందిన చెందిన అంజూ వాఘా సరిహద్దు ద్వారా తిరిగి ఇండియాకు చేరినట్లుగా మీడియా వర్గాల సమాచారం. ఫెస్‌బుక్‌లో 2019లో పరిచయమైన పాకిస్తాన్‌కు చెందిన నస్రూల్లా అనే వ్యక్తిని కలిసుకునేందుకు పాకిస్తాన్‌ వెళ్లి అనూహ్యంగా అతడిని వివాహం చేసుకుంది.


అక్కడ ఆమె తన పేరును ఫాతిమాగా మార్చుకుంది. అంజూ ఫెస్‌బుక్‌ ప్రేమాయణం..పాకిస్తాన్‌ ప్రయాణం…పరిణయం అంతా అప్పట్లో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే కొంతకాలం తర్వాతా తన పిల్లలపై బెంగ పెట్టుకున్న అంజూ తిరిగి భారత్‌ వెలుతుందని నస్రూల్లా వెల్లడించాడు. అన్నట్లుగానే అంజూ తన మాజీ భర్త అరవింద్ వద్ద నివసిస్తున్న15ఏళ్ల కుమార్తె, ఆరేండ్ల కుమారుడిని చూసుకునేందుకు మధ్యప్రదేశ్‌లోని తన ఇంటికి చేరుకుంది.