విధాత: స్వలింగ సంపర్కుల వివాహాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం 3ః2 మెజారిటీతోనూ సర్వోన్నత న్యాయస్థానం స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించేందుకు నిరాకరించింది. అయితే, ప్రత్యేక వివాహ చట్టాన్ని మార్చడం పార్లమెంట్ విధి అని తెలిపిన కోర్టు.. న్యాయస్థానం ఆ చట్టాన్ని రూపొందించదని వ్యాఖ్యానించింది.
స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలైన 21 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ఆయా పిటిషన్లపై జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ జరిపి.. తీర్పును వెల్లడించింది.
అయితే, ఆయా పిటిషన్లపై నాలుగు వేర్వేరు తీర్పులను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వెలువరించింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ నరసింహలు వేర్వేరుగా తీర్పులు వెలువరించారు. న్యాయస్థానం చట్టాన్ని రూపొందించదని.. కానీ, దాన్ని అర్థం చేసుకొని అమలు చేయగలదని జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు.
స్వలింగ సంపర్కం కేవలం పట్టణాలకో.. సంపన్న వర్గాలకో పరిమితం కాదన్నారు. ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం సుప్రీం ఇచ్చే ఆదేశాలు.. వారి అధికారాల విభజనకు అడ్డంకి కాదని సీజేఐ అన్నారు. స్వలింగ సంపర్కులపై వివక్ష చూపరాదని.. అందరినీ సమానంగా చూడాలని కోర్టు సూచించింది.
భిన్న లింగ జంటలు మాత్రమే మంచి తల్లిదండ్రులుగా ఉంటారని చట్టం భావించడం లేదని.. అలా భావిస్తే అది స్వలింగ సంపర్కులపై వివక్షే ఆర్టికల్ 21 స్వేచ్ఛ, సమానత్వ హక్కు ప్రకారం జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు పూర్తిగా ఆ వ్యక్తికే ఉంటుందని స్పష్టం చేశారు.
అయితే, ఈ కేసు విషయంలో ఈ కేసు విషయంలో పార్లమెంట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. సెక్సువల్ ఓరియంటేషన్ ఆధారంగా సంఘాల్లో చేరేందుకు వారి హక్కులను అడ్డుకోలేమని, టాన్స్‌జెండర్లు ప్రస్తుత చట్టాల ప్రకారం మ్యారేజ్ చేసుకునే హక్కు ఉందన్నారు. క్వీర్, అవివాహిత జంటలు చిన్నారులను దత్తత తీసుకోవచ్చని తెలిపారు.
స్వలింగ వివాహనికి చట్టబద్ధత ఏదీ లేదని.. స్వలింగ వివాహం చేసుకున్న వారిని దంపతులుగా గుర్తించబోమన్నారు. వివాహం ప్రాథమిక హక్కు కాదని.. కలిసి జీవించడాన్ని గుర్తిస్తున్నామన్న కోర్టు.. స్వలింగ జంటల అభ్యర్థనలపట్ల సానుభూతి ఉంది కానీ.. చట్టబద్ధత కల్పించలేమని.. శాసన వ్యవస్థలో తాము జోక్యం చేసుకోలేమంటూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది.