భార్యను పశువులా చూడొద్దని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గృహహింస కేసులో నిందితుడికి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ సందర్భంగా భార్యను పశువులా చూడొద్దని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఆమెకు గౌరవంగా జీవించే హక్కు ఉందని పేర్కొంది.
ఈ కేసులో నిందితుడు మద్యం మత్తులో భార్యపై దాడి చేశాడు. నేలపైకి తోయడంతో ఇటుక తగిలి ఆమె తలకు గాయమైంది. ఆ తర్వాత కూడా ఆమెపై కర్రతో కూడా దాడి చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. అయితే ఈ కేసులో నిందితుడు ఏకంగా మూడు వివాహాలు చేసుకోవడం గమనార్మం. నిందితుడు మొదటి భార్య అతడిపై గృహ హింస, తనకు విడాకులు ఇవ్వకుండా మరో రెండు పెళ్లిళ్లు చేసుకోవడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
ఇవి కూడా చదవండి :
అవి సలహాలు కాదు.. ప్రధాని పాలనా వైఫల్యానికి నిదర్శనాలు: రాహుల్ గాంధీ
మాజీ సీఎం స్టాలిన్ తో సీఎం విజయ్ భేటీ
