బైక్స్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? మీకు పండగలాంటి వార్తే..!

మీరు బైక్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే ఇది మీకు పండగలాంటి వార్తే..! దేశీయ దిగ్గజ వాహనాల కంపెనీ సుజుకీ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. సుజుకీ బైక్స్, స్కూటర్స్ కొనుగోలుపై రూ.5వేల వరకు క్యాష్ బ్యాక్‌తో పాటు ఎలాంటి హైపోథికేషన్ లేకుండా వందశాతం వరకు లోన్ ఆఫర్ చేస్తున్నది. అంతేకాకుండా సుజుకీ రూ.6,999 విలువైన రైడింగ్ జాకెట్‌ను సైతం ఇస్తున్నది. దాంతో పాటు రూ.7వేల వరకు బీమా ప్రయోజనాలు సైతం ఇస్తున్నది. ఈ ఆఫర్ ఈ నెల 31 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నది.
ఏయే మోడల్స్‌పై ఆఫర్ వర్తిస్తుందంటే..
సుజుకీ స్కూటర్ పోర్ట్‌ఫోలియోలో అవెంటిస్, యాక్సెస్ 125, బర్గ్మన్ స్ట్రీట్, బర్గ్మన్ స్ట్రీట్ ఈఎక్స్ ఆఫర్స్ ఇస్తున్నది. అలాగే బైక్స్ పోర్ట్ ఫోలియోలో వీ స్ట్రోమ్ ఎస్ ఎక్స్, జిక్సర్ ఎస్ఎఫ్ 250, జిక్సర్ 250, జిక్సర్ ఎస్ఎఫ్, జిక్సర్ ఉన్నాయి. భారీ బైక్స్ కేటగిరీలో కటానా, హయబూసా వీ స్ట్రోమ్ 650 ఎక్స్ టీ మోడల్స్‌పై పండగ ఆఫర్ వర్తించనున్నది.
అయితే, భారీ బైక్ లైనప్‌ను విస్తరించాలని సుజుకీ భావిస్తున్నది. త్వరలో వీస్ట్రోమ్ 800 డీఈను త్వరలో మార్కెట్‌లోకి లాంచ్ చేయబోతున్నది. ఇందులో 776 సీసీ లిక్విడ్ కూల్డ్, పారలల్ ట్విన్ యూనిట్ ఇంజిన్ ఉండనున్నది. 270 డిగ్రీ క్రాంక్ షాఫ్ట్ డిజైన్‌తో వస్తుంది. ఈ బైక్ ఇంజిన్ 8,500 ఆర్పీఎం వద్ద 83 బీహెచ్పీ గరిష్ఠంగా టార్క్‌ను ఉత్పత్తి చేయనున్నది. ఇందులో 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఉండగా.. బైక్ లీటర్ పెట్రోల్‌కు 22.7 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని సుజుకీ తెలిపింది.