విధాత: టోల్ ప్లాజా వద్ద ఆగిన ఆరు వాహనాలను కారు వేగంగా ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ ఘటన గురువారం రాత్రి ముంబైలోని బాంద్రా టోల్‌ప్లాజా వద్ద చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్లీ నుంచి బాంద్రా వైపు వేగంగా వస్తున్న కారు ఈ ప్రమాదానికి కారణమైంది.
గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు 9-జోన్ డీసీపీ కృష్ణకాంత్ ఉపాధ్యాయ తెలిపారు. ” గురువారం రాత్రి 10:15 గంటల ప్రాంతంలో వర్లీ నుంచి బాంద్రా వైపు వెళుతుండగా కారు టోల్ ప్లాజాకు 100 మీటర్ల ముందు ఒక వాహనాన్ని ఢీకొట్టింది.
అనంతరం కారు వేగంగా వచ్చి 2-3 వాహనాలను ఢీకొట్టింది. టోల్ ప్లాజా వద్ద వరుసగా ఉన్న ఆరు వాహనాలు ఢీకొన్నాయి. ఇప్పటి వరకు తొమ్మిది మందికి గాయాలయ్యాయి. అందులో ముగ్గురు మృతి చెందారు. ఆరుగురు చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది” అని డీసీపీ ఉపాధ్యాయ్ తెలిపారు.