Woman Police | మ‌ద్యం మ‌త్తులో మ‌హిళకు పోలీసు ఆఫీస‌ర్ లిప్ కిస్.. వీడియో

Woman Police | ప‌ది మందికి ఆద‌ర్శంగా ఉండాల్సిన పోలీసులే( Police ) త‌మ విధుల ప‌ట్ల నిర్ల‌క్ష్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. విధుల్లో ఉండ‌గానే అసాంఘిక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నారు. పీక‌ల దాకా మ‌ద్యం( Alcohol ) సేవించి.. మ‌హిళ‌లు( Women ), చిన్నారుల ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు.

Woman Police | మ‌ద్యం మ‌త్తులో మ‌హిళకు పోలీసు ఆఫీస‌ర్ లిప్ కిస్.. వీడియో

Woman Police | ప‌ది మందికి ఆద‌ర్శంగా ఉండాల్సిన పోలీసులే( Police ) త‌మ విధుల ప‌ట్ల నిర్ల‌క్ష్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. విధుల్లో ఉండ‌గానే అసాంఘిక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నారు. పీక‌ల దాకా మ‌ద్యం( Alcohol ) సేవించి.. మ‌హిళ‌లు( Women ), చిన్నారుల ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. పోలీసులంటేనే భ‌య‌ప‌డేలా అనుచితంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు పోలీసులు.

ప‌శ్చిమ బెంగాల్( West bengal ) ప్ర‌భుత్వం ఇటీవ‌లే మ‌హిళ‌ల భ‌ద్ర‌త కోసం పింక్ మొబైల్ వ్యాన్ల‌ను( pink Mobile Vans ) ఏర్పాటు చేసింది. ఈ వ్యాన్ల‌లో మ‌హిళా పోలీసులు( Woman Police ) పెట్రోలింగ్ చేస్తూ, మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌ను ప‌ర్య‌వేక్షించ‌నున్నారు. అయితే సిలిగురి( Siliguri )లో అసిస్టెంట్ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ త‌నియా రాయ్( Taniya Roy ) త‌న సిబ్బందితో బుధ‌వారం రాత్రి విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. త‌నియా అనే మ‌హిళా పోలీసు ఆఫీస‌ర్.. పీక‌ల దాకా మ‌ద్యం సేవించి, ఓ ఇద్ద‌రు చిన్నారుల‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించేందుకు య‌త్నించారు.

దీంతో స్థానికులు గ‌మ‌నించి.. త‌నియాను నిల‌దీశారు. మ‌ద్యం సేవించి, విధులు నిర్వ‌ర్తించ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. ఈ క్ర‌మంలో త‌నియా.. అక్క‌డున్న ఓ మ‌హిళ‌కు లిప్ కిస్ ఇచ్చేందుకు ప్ర‌య‌త్నించింది. తాను మ‌ద్యం సేవించానో లేదో చూడు అన్న‌ట్టు లిప్ కిస్( Lip Kiss ) ఇవ్వ‌బోయింది ఆమె. అంత‌టితో ఆగ‌కుండా మ‌రింత అనుచితంగా ప్ర‌వ‌ర్తించిందామె.

ఇక ఏఎస్ఐ త‌నియా రాయ్‌పై అక్క‌డున్న మ‌హిళ‌లు దాడి చేసేందుకు ప్ర‌య‌త్నించారు. మిగ‌తా పోలీసులు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. మ‌హిళా పోలీసుపై అటు నెటిజ‌న్లు, ఇటు బీజేపీ నేత‌లు( BJP Leaders ) తీవ్రంగా స్పందించారు. పీక‌ల దాకా మ‌ద్యం సేవించి విధుల్లో పాల్గొన‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. ఇలాంటి పోలీసుల‌పై త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.