తెలంగాణకు రూ.2,155 కోట్లు, ఏపీకి రూ.1,543 కోట్లు

అన్ని రాష్ట్రాలకూ కలిపి రూ.75వేల కోట్ల జీఎస్‌టీ పరిహారం విడుదల విధాత,న్యూ ఢిల్లీ:జీఎస్‌టీ పరిహారం కింద కేంద్రప్రభుత్వం తెలంగాణకు రూ.2,155 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,543 కోట్లు, విడుదల చేసింది. మొత్తం అన్ని రాష్ట్రాలకూ కలిపి రూ.75వేల కోట్లు ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికశాఖ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు ఏర్పడే రూ.1.50 లక్షల కోట్ల లోటును రిజర్వుబ్యాంకు నుంచి తీసుకొనే రుణం ద్వారా చెల్లించడానికి మే 28న జరిగిన 43వ […]

  • By: Venkat    news    Jul 16, 2021 12:08 PM IST
తెలంగాణకు రూ.2,155 కోట్లు, ఏపీకి రూ.1,543 కోట్లు

అన్ని రాష్ట్రాలకూ కలిపి రూ.75వేల కోట్ల జీఎస్‌టీ పరిహారం విడుదల

విధాత,న్యూ ఢిల్లీ:జీఎస్‌టీ పరిహారం కింద కేంద్రప్రభుత్వం తెలంగాణకు రూ.2,155 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,543 కోట్లు, విడుదల చేసింది. మొత్తం అన్ని రాష్ట్రాలకూ కలిపి రూ.75వేల కోట్లు ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికశాఖ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు ఏర్పడే రూ.1.50 లక్షల కోట్ల లోటును రిజర్వుబ్యాంకు నుంచి తీసుకొనే రుణం ద్వారా చెల్లించడానికి మే 28న జరిగిన 43వ జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంలో కేంద్రం అంగీకరించింది. 2020-21లో ఇదే విధానంలో కేంద్రం రాష్ట్రాలకు రూ.1.10 లక్షల కోట్లు అందించింది. 2021-22లో రూ.1.59 లక్షల కోట్లు చెల్లిస్తోంది.

సెస్‌ వసూళ్ల ఆధారంగా చెల్లించే రూ.లక్ష కోట్ల పరిహారం కూడా కలిపితే ఈ ఏడాది కేంద్రం నుంచి రాష్ట్రాలకు జీఎస్‌టీ పరిహారం రూ.2.59 లక్షల కోట్లు అందుతుందని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. ప్రస్తుతం రూ.75వేల కోట్ల విడుదలతో ఈ ఏడాది ఒక్క విడతలోనే 50% పరిహారం చెల్లించినట్లయిందని పేర్కొంది. ఈ మొత్తాన్ని కేంద్రం 5 ఏళ్ల సెక్యూరిటీల విక్రయం ద్వారా రూ.68,500 కోట్లు, 2 ఏళ్ల సెక్యూరిటీల విక్రయం ద్వారా రూ.6,500 కోట్లు సేకరించింది. 5 ఏళ్లకు 5.60%, రెండేళ్లకు 4.25% మేర వార్షిక వడ్డీ వర్తిస్తుందని ఆర్థికశాఖ తెలిపింది. ఈ నిధులతో రాష్ట్రప్రభుత్వాలు తమ పరిధిలో వైద్య ఆరోగ్య మౌలిక వసతులు, ఇతర ప్రాజెక్టులు చేపట్టడానికి వీలవుతుందని ఆర్థికశాఖ అభిప్రాయపడింది.