Sabdham: నాడు నీటితో వణికించారు.. ఇప్పుడు ‘శబ్ధం’తో!

ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) చాలా గ్యాప్ తర్వాత నటించిన చిత్రం శబ్ధం (Sabdham). పుష్కరం క్రితం వచ్చిన సూపర్ నాచురల్ థ్రిల్లర్ వైశాలి సినిమాకు సీక్వెల్‌గా హర్రర్, సూర్ నేచురల్ థ్రిల్లర్ జానర్‌లో ఈ సినిమా తెరకెక్కింది. లక్ష్మీ మీనన్, లైలా,సిమ్రన్ కీలక పాత్రల్లో నటిస్తోండగా వైశాలి సినిమాను డైరెక్ట్ చేసిన అరివళగన్ వెంకటాచలం ఈ మూవీకి దర్వకత్వం వహించాడు.
సుమారు ఏడాదిన్నర చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఇప్పుడు విడుదలకు రెడీ అయింది. పాన్ ఇండియాగా తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఫిబ్రవరి 28న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు.
ఈమేరకు భయం శబ్ధం భయపెట్టించేందుకు వస్తోంది.. అంటూ అధికారికంగా సోషల్ మీడియాలో పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే వైశాలి సినిమాలో వాటర్ (నీరు) ప్రధానాంశం కాగా ఈ చిత్రంలో సౌండ్ (శబ్ధం) కీలకంగా ఉండనుంది.