Ramya Pasupuleti: రస రమ్యం.. నయనానందకరం

టాలీవుడ్‌లో క్రమంగా అచ్చ తెలుగు బ్యూటీలా హంగామా మొదలైంది. ఇప్పటికే శ్రీలీల, ఇషా రెబ్బా, అనన్య నాగళ్ల, అంజలి, శ్రీదివ్య, శ్రీగౌరీప్రియ వంటి భామలు వరుస సినిమా వఅవకాశాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల ఆ జాబితాలో రమ్య పసుపులేటి చేరింది.
అందానికి అందం, గ్లామర్, అభినయం పుష్కలంగా ఉన్న ఈ భామ షార్ట్ ఫిలింలతో మొదలు పెట్టి ఇప్పుడు కథానాయికగా మంచి ఆఫర్లను దక్కించుకుంటోంది.
ఇటీవల మారుతీ నగర్ సుబ్రమణ్యం సినిమాలోని పాత్రలో మంచి మార్కులు కొట్టేసిన ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు బాగానే తలుపు తడుతున్నాయి. ఆ సినిమాతో మంచి హిట్‌ను కూడా తన ఖాతాలో వేసుకుంది.
ఖాళీ సమయాల్లో వీదేశీ టూర్లకు వెళ్లే ఈ చిన్నది అక్కడి అందాలను వీక్షించడమే కాకుండా తన అందాలను కూడా ప్రదర్శిస్తూ యూత్‌లో మంచి ఫాలోయింగ్ పెంచుకుంటోంది.
తరుచూ వీదేశీయానాలు చేస్తూ.. అందాలను వడ్డీవారుస్తూ రస రమ్యం.. నయనానందకరం అనేలా చేస్తోంది.