KCR: ఆ కేసులో.. కేసీఆర్‌కు ఊరట!

  • By: sr    news    Apr 03, 2025 7:26 PM IST
KCR: ఆ కేసులో.. కేసీఆర్‌కు ఊరట!

విధాత : బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు హైకోర్టులో ఊరట దక్కింది. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆయనపై నమోదైన రైల్ రోకో కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. 2011 అక్టోబర్ 15న ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా సికింద్రా బాద్ లో రైల్ రోకో చేపట్టారు. ఆ సమయంలో కేసు నమోదు చేసి పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు ఇప్పటివరకు ప్రజాప్రతినిధుల కోర్టులో పెండింగ్ లో ఉంది. కేసీఆర్ పిలుపు మేరకే రైల్ రోకో చేపట్టారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. అయితే, రైల్ రోకో జరిగిన సమయంలో అక్కడ కేసీఆర్ లేరని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం.. కేసీఆర్ పై నమోదైన కేసు కొట్టివేసింది.