Syria: సిరియాలో అంతర్యుద్ధం..1000 మందికి పైగా మృతి

  • By: sr    news    Mar 09, 2025 8:33 PM IST
Syria: సిరియాలో అంతర్యుద్ధం..1000 మందికి పైగా మృతి

Syria:

విధాత: సిరియాలో ఆంతర్యుద్ధం ఇప్పటికే వెయ్యి మందికి పైగా బలి తీసుకుంది. సిరియా భద్రతా బలగాలకు.. మాజీ అధ్యక్షుడు బషర్ అసద్ మద్దతు మధ్య జరుగుతున్న ఆధ్వర్యంలో మరణాల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఇప్పటివరకు 1000 మంది ప్రాణాలు కోల్పోగా.. మృతుల్లో 745 మంది సాధారణ పౌరులు.. 148 మంది మిలిటెంట్లు..125 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లుగా తెలిసింది.

బషర్ నుంచి తిరుగుబాటుదారులు అధికారం దక్కించుకున్న మూడు నెలల తర్వాత ఘర్షణలు ఉదృతమయ్యాయి. ఘర్షణలు ఉదృతంగా ఉన్న లటాకీయ నగరంలో విద్యుత్తు , మంచినీటి సరఫరాలను నిలిపివేశారు. భవనాలు.. రోడ్లపై ఘర్షణలో మరణించిన వారి మృతదేహాలు పడి ఉండగా… అంతటా బీభత్స వాతావరణం నెలకొంది.