విజయనగరంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

విధాత‌(విజయనగరం): నగరంలో జిల్లా కలెక్టర్ డా ఎం. హరి జవహర్ లాల్ ఆకస్మిక తనిఖీలు నిర్వ‌హించారు. అదనపు ఎస్.పి. సత్యనారాయణ రావు తో కలసి నగరంలో కర్ఫ్యూ అమల‌వుతున్న పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఆర్టీసీ కాంప్లెక్స్, బాలాజీ జంక్షన్ మీదుగా మూడు లాంతర్లు కూడలి వరకు వెళ్లిన కలెక్టర్ అక్క‌డ 12 గంటల తర్వాత దుకాణాలు తెరచి వుంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క‌ర్ఫ్యు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వాహ‌న రాక‌పోక‌లు ఉండ‌డంతో వాహ‌న య‌జ‌మానుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం […]

విజయనగరంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

విధాత‌(విజయనగరం): నగరంలో జిల్లా కలెక్టర్ డా ఎం. హరి జవహర్ లాల్ ఆకస్మిక తనిఖీలు నిర్వ‌హించారు. అదనపు ఎస్.పి. సత్యనారాయణ రావు తో కలసి నగరంలో కర్ఫ్యూ అమల‌వుతున్న పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఆర్టీసీ కాంప్లెక్స్, బాలాజీ జంక్షన్ మీదుగా మూడు లాంతర్లు కూడలి వరకు వెళ్లిన కలెక్టర్ అక్క‌డ 12 గంటల తర్వాత దుకాణాలు తెరచి వుంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క‌ర్ఫ్యు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వాహ‌న రాక‌పోక‌లు ఉండ‌డంతో వాహ‌న య‌జ‌మానుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

అనంతరం ఎం.జి. రోడ్డులో పర్యటించి తెరిచి ఉంచిన దుకాణాల‌ను దగ్గరుండి మూసి వేయించారు. మ‌ధ్యాహం 12గంట‌ల‌ తర్వాత దుకాణాలు తెరచి ఉంచినా, రోడ్లపై అకారణంగా సంచరించినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.