విధాత: న్యాయస్థానాలు రాష్ట్రపతికి ఆదేశాలు ఇచ్చే పరిస్థితి ఉండకూడదని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని వైస్ ప్రెసిడెంట్ ఎంక్లేవ్‌లో జరిగిన 6వ రాజ్యసభ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లో పాల్గొని ఆయన మాట్లాడారు. శాసనసభలు ఆమోదించిన బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్ లకు 3నెలల గడువు విధిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థ పై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత రాష్ట్రపతి పదవి చాలా అత్యున్నతమైందని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు శపధం చేసి బాధ్యతలు స్వీకరిస్తారన్నారు. సుప్రీంకోర్టు తాజా తీర్పును రాష్ట్రపతిని ఆదేశిస్తుందని..ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు అని ధన్ ఖడ్ అభిప్రాయపడ్డారు. జడ్జిలకు బాధ్యత లేదన్నారు. జడ్జిలు చట్టాలు చేస్తున్నారా లేక ఎగ్జిక్యూటివ్ పనులు నిర్వహిస్తున్నారా అని అసహనం వ్యక్తం చేశారు.
రాష్ట్రపతికి ఆదేశాలు ఇచ్చే అధికారం కోర్టులకు లేదని ఆయన అన్నారు. రాజ్యాంగంలోని 142వ అధికరణ ద్వారా సుప్రీంకోర్టు ప్రత్యేక అధికారాలు వర్తిస్తాయని, అయితే ఆ అధికరణను ప్రజాస్వామ్య వ్యవస్థలపై ఓ న్యూక్లియర్ మిస్సైల్ తరహా వాడుతున్నట్లు ఆరోపించారు. డెడ్‌లైన్ ప్రకారం పనిచేయాలని రాష్ట్రపతిని ఆదేశించడం సరికాదన్నారు. సుప్రీం వ్యాఖ్యలను పరిశీలిస్తే జడ్జీలే శాసన వ్యవహారాలు చూస్తున్నట్లు ఉందన్నారు. ఎగ్జిక్యూటీ ఆదేశాలు అమలు చేస్తున్నట్లు ఉందన్నారు. సూపర్ పార్లమెంట్‌ను జడ్జీలు నడిపిస్తున్నట్లు ఉందన్నారు. దేనికీ బాధ్యత లేనట్లుగా వ్యవహరిస్తున్నారని, ఇది ఈ నేల విధానాలకు వర్తించదు అని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రపతిని ఆదేశించే పరిస్థితి సరికాదు అని, అసలు ఏ ఆధారంగా అలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 145(3) ప్రకారం మాత్రమే రాజ్యాంగాన్ని ప్రశ్నించే హక్కు ఉందన్నారు. దానికి కూడా అయిదుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది జడ్జీలతో ధర్మాసనం ఏర్పాటు చేయాలన్నారు. జడ్జిల ఇంట్లో నగదు దొరికిన విచారణ లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. జడ్జిలపై విచారణకు ఎఫ్ఐఆర్ లేకుంటే ఎలా ప్రశ్నించారు. ప్రజలే రాజ్యాంగాన్ని ఇచ్చారని.. వాటి పట్ల అందరం జవాబుదారులమని స్పష్టం చేశారు.