కర్రీ పఫ్ లో పాము..ఫాస్ట్ ఫుడ్ పై తస్మాత్ జాగ్రత్త

జడ్చర్లలో కర్రీ పఫ్‌లో పాము పిల్ల కలకలం. బేకరీ ఆహార భద్రతపై ప్రశ్నలు, పోలీసులు కేసు నమోదు.

కర్రీ పఫ్ లో పాము..ఫాస్ట్ ఫుడ్ పై తస్మాత్ జాగ్రత్త

విధాత : హోటళ్లు..బేకరీలలో ఫుడ్ ఐటైమ్స్ అంటేనే భయపడే రోజులివి. వాటిలో నాణ్యత..శుభ్రత ఎంతన్నది తెలియకుండానే..యధాలాపంగా కొనుగోలు చేయడం.. ఆర్డర్ పెట్టడం..తినడం చేస్తున్నారు. ఎప్పుడో ఒకసారి ఫుడ్ ఇన్ స్పెక్టర్ల బృందాలు తనిఖీ చేస్తే బొద్దింకలు..కాలం చెల్లిన వంటలు, కుళ్లిన చికెన్, కూరగాయాలు, కడగని వంట పాత్రలు, మురికినీటితో తయారుచేసే ఆహార పదార్ధాలు వెలుగుచూస్తున్న ఘటనలు హోటళ్లు, బేకరీల ఫుడ్ పట్ల నమ్మకాన్ని తగ్గిస్తున్నాయి. అడపదడపా బొద్ధింకలు, బల్లులు కూడా వాటిలో తయారయ్యే ఫుడ్ ఐటమ్స్ లలో వెలుగుచూస్తున్నాయి. ఈ దఫా ఏకంగా ఓ బేకరీ నుంచి కొనుగోలు చేసిన కర్రీ పఫ్(Curry Puff) లో పాము పిల్ల రావడం సంచనం రేపింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

జడ్చర్లలోని(Jadcherla) జౌఖీనగర్‌కు చెందిన శ్రీశైల అనే మహిళ శ్రీలక్ష్మి అయ్యంగారి బేకరీలో రెండు ఎగ్ పఫ్ లు, రెండు కర్రీ పఫ్ లు కొనుగోలు చేసింది. ఎగ్‌పఫ్‌లను పిల్లలిద్దరూ బేకరీ దగ్గరే తినేశారు. కర్రీ పఫ్‌ను శ్రీశైల ఇంటికి పార్శిల్ తీసుకువచ్చింది. ఇంటికి తీసుకొచ్చిన కర్రీ పఫ్‌ ను ఆమె తినబోతుండగా అందులో కనిపించిన దృశ్యం చూసి శ్రీశైల పై ప్రాణాలు పైనే పోయాయి. కర్రీ పఫ్ లో పాము పిల్ల రావడంతో భయంతో షాక్ కు గురైంది. వెంటనే వాటిని తినడం ఆపేసి..పాముపిల్లతో కూడిన కర్రీపఫ్ ను పట్టుకుని బేకరీకి వెళ్లి నిర్వహకుల నిర్వాకాన్ని ప్రశ్నించింది. బేకరీ షాప్ నిర్వహకులు కూరగాయాలలో పాము పిల్ల వచ్చి ఉండవచ్చంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. పోలీసులు వెంటనే బేకరీ వద్దకు చేరుకొని, ఆహార పదార్థాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని, ఫుడ్ ఇన్స్పెక్టర్ కు సమాచారం అందించారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌ ఇచ్చే నివేదిక ఆధారంగా బేకరీ నిర్వహకులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి…

ఏపీలో సెమీ కండక్టర్ల యూనిట్..కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం

రజనీకాంత్ కూలీ పార్ట్2 ఉందా!