ఎలుక పాలు లీటరు ఎన్ని లక్షలో తెలుసా?

ఎలుక పాలు లీటరు ఎన్ని లక్షలో తెలుసా?

ఇంతవరకు అత్యంత ఖరీదైన పాలు అంటే గాడిద పాలని భావించేవారు. కానీ.. వాటి పాలకు మించిన ధర కలిగిన పాలు ఒక జీవి నుంచి వస్తాయట! ఆ జీవి ఏదో కాదు.. వినాయకుడి వాహనమైన మూషికమే! లక్షల్లో పలికే ఈ పాలకు పరిశోధకుల్లో భారీ డిమాండే ఉన్నది. ఇంతకీ ఎలుక పాలు ఎందుకింత కాస్ట్లీ? ఎందుకంటే ఎలుక పాలు తీయడం అంత ఈజీ టాస్క్‌ ఏమీ కాదు.



ఒక్కో ఎలుక నుంచి పాలు తీయడానికి కనీసం 30 నిమిషాలు పడుతుందట. అది చాలా కొద్దిమొత్తంలోనే లభిస్తుంది. ఒక లీటర్‌ పాల ఉత్పత్తికి దాదాపు 40 వేల ఎలుకలు అవసరమని చెబుతున్నారు. ఇలా సేకరించిన లీటరు పాలు.. ఐరోపాలో 23వేల యూరోలు పలుకుతాయి. అది మన భారతీయ కరెన్సీలో అయితే.. సింపుల్‌గా 18 లక్షలు.

ఇంతకీ ఈ ఎలుక పాలను ఎందుకు ఉపయోగిస్తారు? వీటిని పరిశోధకులు తమ పరిశోధనల్లో భాగంగా ఉపయోగిస్తారట. మలేరియా బ్యాక్టీరియాను చంపే మందుల తయారీలో ఎలుక పాలను ఉపయోగిస్తారు. అయితే శాస్త్రవేత్తలు ఆవుపాలకు బదులుగా ఈ ఎలక పాలనే ఎందుకు ఉపయోగిస్తున్నారంటే.


ఎలుక డీఎన్‌ఏ.. ఇతర జంతువుల డీఎన్‌ఏ కంటే ప్రభాతిభావంతమైనదట. పైగా మానవ శరీరానికి చాలా దగ్గర సంబంధం కలిగి వుంటుందట. అందువల్ల ప్రయోగాల ఫలితాలను విశ్లేషించడం కూడా చాలా సులభం అవుతుందని ఎలుక పాలను ఉపయోగిస్తారని చెబుతున్నారు. ప్రయోగాలకు వేల జంతువులు అవసరం.



అంత పెద్ద మొత్తంలో ఆవులకు బదులు.. ఎలుకలను ఉపయోగించడమే ఈజీ అని చెబుతున్నారు. మలేరియాను నయం చేసే మందుల్లోనే గాక రీచార్జ్ మెటీరియల్ గానూ ఈ పాలను వినియోగిస్తారు. అందువల్ల ఈ ఎలుక పాలు పరిశోధనలపరంగా కూడా అత్యంత ఖరీదైనవి.


ఏ జంతువు ఎక్కువ పాలు ఉత్పత్తి చేస్తుందంటే

ఒక ఆవు ఏడాదికి దాదాపు పదివేల లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది దాని బరువు కంటే ఏడు రెట్లు ఎక్కువ. మేకలు ఏడాదికి వాటి బరువు కంటే 12 రెట్ల పాలను ఉత్పత్తి చేస్తాయి. ఇప్పటివరకు ఉన్న జీవులన్నింటిలోనూ బ్లూ వేల్.. పాల ఉత్పత్తిలో రికార్డును కలిగి ఉంది. నీలి తిమింగలం రోజుకు 600 లీటర్ల పాలు ఉత్పత్తి చేస్తుంది. ఈ పాలు చాలా కొవ్వుతో ఉంటాయి. కాబట్టి తిమింగలం పిల్ల రోజుకు వంద లీటర్ల పాలు త్రాగుతుంది. దాదాపు అదే మోతాదులో బరువు పెరుగుతుంది.