విధాత:ఈ బైక్ ను సాయి ధరమ్ తేజ్ రీసెంట్‌గా హైదరాబాద్‌లో కొలుగోలు చేశాడు. TS07 GJ1258 ఇది ఆ బైక్ రిజిష్ట్రేషన్ నంబర్. అనిల్ కుమార్ పేరుతో బైక్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది. ఆయన వాడిన బైక్ ఖరీదు రూ. 11 లక్షల నుంచి 18 లక్షల మధ్య ఉంటుంది. ఈ స్పోర్ట్స్ బైక్ 660 సీసీ ఇంజన్‌ను కలిగి ఉన్న హై ఎండ్ బైక్.
దీని బరువు దాదాపు 200 కేజీల వరకు ఉంటుంది. బైక్ రైడింగ్ అంటే సాయి తేజ్‌కి చాలా ఇష్టం. విరామం దొరికితే చాలు తన బైక్ లేదా స్నేహితుల బైక్ తీసుకుని సరదాగా రైడింగ్ కు వెళతాడు. శుక్రవారం కూడా అదే క్రమంలో వెళుతున్న క్రమంలో ఊహించని విధంగా ఈ ప్రమాదం జరిగింది.