తన కొట్టారంటూ రఘురామరాజు చూపించిన అరికాలు గాయాలు.. గాయాలు కావని జీజీహెచ్ వైద్యులు హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో స్పష్టంచేశారు. రఘురామరాజు కాలిపై కనిపిస్తున్న మచ్చలు లేక గుర్తులకు కారణంగా ఎడీమా అని తేలచ్చారు.
ఎడీమా అంటే: మెడికేషన్ వల్ల లేదా గర్భందాల్చడం లేదా ఇన్‌ఫెక్షన్లు వల్ల ఎడీమా వస్తుంది. రక్తనాళాలనుంచి ద్రవాలు స్రవించి, ఈ ద్రవాలు పక్కనే ఉన్న కణజాలమీదకు పేరుకుంటాయి. దీనివల్లే కాళ్లు వాచినట్టుగా, కమిలినట్టుగా కనిపిస్తాయి. ఇదే అంశాన్ని జీజీహెచ్ వైద్యులు హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది.