Eatala Rajendar : కాళేశ్వరం అవకతవకలపై సీబీఐ విచారణ సరైన నిర్ణయం
కాళేశ్వరం అవకతవకలపై సీబీఐ విచారణ నిర్ణయం సరైందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు.

Eatala Rajendar | విధాత, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలోని అవకతవకలు..అవినీతిపై సీబీఐ(CBI) విచారణ జరిపించాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం సరైందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Eatala Rajendar) అన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక తప్పుల తడక అని..అది నిలువదని తెలిసే.. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వానికి చేతకాదని అర్ధమైందని.. ఆ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోలేరని గ్రహించే సీబీఐ విచారణ కోరారని ఈటల అభిప్రాయపడ్డారు. సీబీఐ విచారణ నిర్ణయం మంచిపనే అని..వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు.
మల్కాజిగిరి(Malkajgiri) పార్లమెంట్ పరిధిలోని 150 వ డివిజన్ మోండా మార్కెట్లో వీసీడీడీ రోడ్డు పనులకు వెస్ట్ మారేడుపల్లిలోని ఎరుకల బస్తీలో ఎమ్మెల్యే ఎన్. గణేష్(MLA N. Ganesh) తో కలిసి ఈటల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కాళేశ్వరంపై సీబీఐ విచారణను స్వాగతిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ , కంటోన్మెంట్ బోర్డు మెంబర్ శ్రీమతి నర్మదా మల్లికార్జున్, నాయకులు పిట్ల నగేష్,విజయ్ ఆనంద్ , జీహెచ్ఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.