CarnivorousPlants: కీటకాలను తినే చెట్లు… ఇవి ప్రపంచంలోనే అత్యంత అరుదైనవి..

CarnivorousPlants: కీటకాలను తినే చెట్లు .. ప్రపంచంలో అరుదైనవి.. ప్రపంచంలో ఎంతో వింతైన చెట్లు ఉన్నాయన్న విషయం తెలిసిందే. అయితే కీటకాలను ఆహారంగా తీసుకొనే చెట్లు కూడా ఉన్నాయి. సహజంగా చెట్లకు నీరు పోస్తే పెరుగుతాయి. సూర్యరక్షి ద్వారా అవి ఎదుగుతూ ఉంటాయి. రకాలైన మొక్కలకు ఎరువులు కూడా అందిస్తుంటాము. అయితే కీటకాలను ఆహారంగా తీసుకొనే చెట్లు కూడా ఉన్నాయి.
వీటిని సాధారణంగా “మాంసాహార మొక్కలు” అని పిలుస్తారు. వీనస్ ఫ్లైట్రాప్ మరియు పిచ్చర్ ప్లాంట్ మొక్కలు కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. కీటకాలను ఆకర్షించి, బంధించి, వాటిని జీర్ణం చేస్తాయి. వీనస్ ఫ్లైట్రాప్ అనే మొక్క కీటకాలు, సాలెపురుగులను పట్టుకుని తింటుంది.
ఈ మొక్క యునైటెడ్ స్టేట్స్ లోని నార్త్ కరోలినా మరియు దక్షిణ కరోలినాలో పెరుగుతుంది. కీటకాలను తినే సమయంలో ఆకులు రెండుగా విడిపోతాయి. అనంతరం ఇవి దవడల మాదిరిగా పనిచేస్తాయి. ఆకుల లోపలి ఉపరితలంపై చిన్న వెంట్రుకలు ఉంటాయి.
వీటిని ట్రైకోమ్స్ అంటారు. కీటకం ఆకు లోపలికి ప్రవేశించినప్పుడు. ఈ వెంట్రుకలు కదలికలను గుర్తిస్తాయి. ఆ వెంటనే ఆకులు మూసుకుపోతాయి. దీంతో కీటకం చిక్కుకుంటుంది. అంతేకాక మొక్క దానిని జీర్ణం చేయడానికి ఎంజైమ్‌లను విడుదల చేస్తుంది.
ఈ మొక్క కిరణజన్య సంయోగక్రియ ద్వారా శక్తిని పొందే సమయంలో కీటకాలను కూడా తింటుంది. ఇది మోనోటైపిక్ జాతి, అంటే దీని జాతికి ఇది ఒక్కటే జాతి. ప్రముఖ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ ఈ మొక్కను “ప్రపంచంలో అత్యంత అద్భుతమైన మొక్క” అని పిలిచాడు. వీనస్ అంటే అందమైన దేవత అనే అర్థం కూడా ఉంది.