Viral: స్వామి నిత్యానంద మృతి? నెట్టింట న్యూస్ వైర‌ల్‌!

  • By: sr    news    Apr 01, 2025 10:01 PM IST
Viral: స్వామి నిత్యానంద మృతి? నెట్టింట న్యూస్ వైర‌ల్‌!

విధాత: తనకు తానుగా దేవుడిగా ప్రకటించుకున్న నిత్యానంద స్వామి చనిపోయారంటూ స్వయంగా ఆయన మేనల్లుడు పోస్టు చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివాదాస్పద స్వామి నిత్యానంద రెండు రోజుల కిందట మృతి చెందారని నిత్యానంద సోదరి కుమారుడు సుందరేశ్వరన్ పేరుతో ఓ వీడియా చక్కర్లు కొడుతోంది. అయితే నిత్యానంద మరణ వార్త సమాచారంలో నిజం ఎంత అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఆయన చివరిసారిగా మహాశివరాత్రి రోజున జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వీడియో అప్పట్లో వైరల్ అయింది. అయితే, సాంకేతిక లోపం కారణంగా ఆ ప్రసంగం మధ్యలో అకస్మాత్తుగా నిలిచిపోయింది. అప్పటి నుంచి ఎలాంటి సత్సంగాలలో నిత్యానంద కనిపించలేదు.

ఈ క్రమంలో ఆయన చనిపోయాడనే వార్తలు వైరల్ గా మారాయి. అసలు నిత్యానంద ఎప్పుడు చనిపోయాడు..ఎలా చనిపోయాడన్న దానిపై స్పష్టత లేదు. ఏప్రిల్ 1 కావడంతో ఫూల్స్‌ను చేయడానికి ఇలా పుకార్లు పుట్టించారా? లేక కేసుల నుంచి తప్పించుకునేందుకా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిత్యానంద నిర్యాణం నిజమైతే కైలాస దేశంతో పాటు.. దాదాపు.. 4వేల కోట్ల నిత్యానంద ఆస్తులకు వారసుడు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. నిత్యనంద తర్వాత ఆయన మేనల్లుడు సుందరేశ్వరన్ పీఠం ఎక్కుతారన్న ప్రచారం నడుస్తొంది. మరోవైపు నిత్యనందతో రొమాన్స్ చేసిన రంజిత(నందిత) సైతం ఈ పీఠంను ఎక్కేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రచారం వినిపిస్తుంది.

ఆది నుంచి నిత్యానంద వివాదస్పదమే

తనను తాను ఆధ్యాత్మిక గురువుగా..దేవుడిగా చెప్పుకుంటూ అనేక చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిత్యానంద పాల్పడ్డారు. తమిళనాడులోని తిరువణ్ణామలైకి చెందిన నిత్యానంద స్వామి కర్నాటకలోని బిడిదిలో ఆశ్రమం స్థాపించాడు. దేశంలోని వివిధ ప్రదేశాలలో కూడా ఆశ్రమాలను స్థాపించాడు. కన్నడ హీరోయిన్ రంజితతో నిత్యానంద రోమాన్స్ చేస్తున్న వీడియో బయటపడటంతో వివాదంలో చిక్కుకున్నాడు. ఆతర్వాత ఈయన పేరు దేశంలో ఒక్కసారిగా మార్మోగిపోయింది. మహిళా శిష్యులతో నిత్యానంద అసభ్యంగా, దురుసుగా ప్రవర్తించాడని ఆరోపణలు వచ్చాయి. బెంగుళూరులో లైంగిక వేధింపుల కేసు నమోదైన తర్వాత అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కిడ్నాప్ ,అత్యాచారం వంటి పలు ఆరోపణలు ఎదుర్కొంటూ 2019లో నిత్యానంద స్వామి దేశం విడిచి పారిపోయారు.

ఆయనపై లుక్‌ఔట్ నోటీ సులు జారీ కాగా.. కొన్నేళ్లు గా పరారీలో ఉన్నారు. దేశం విడిచి వెళ్లిపోయిన అతడు.. ఈక్వెడార్‌ ఐలాండ్‌ను కొనుగోలు చేసి రిపబ్లిక్‌ ఆఫ్‌ కైలాస’ను ప్రత్యేక దేశంగా స్థాపించి సంచలనం సృష్టించారు. అంతటితో ఆగకుండా.. ప్రత్యేకంగా కైలాసకు వెళ్లడానికి కరెన్సీ, పాస్ పోర్టు, జెండాను కూడా రూపొందించుకున్నాడు. తమదేశాన్ని గుర్తించాలని ఐక్యరాజ్యసమితికి ప్రతినిధుల్ని సైతం నిత్యనంద పంపించిన విషయం తెలిసిందే. కైలాసలోనే నివాసం ఉంటున్న నిత్యానంద కొన్నిరోజులుగా తరచుగా కిడ్ని సమస్యలతో బాధపడుతున్నారని..ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఆయన చనిపోయారని మేనల్లుడు స్వయంగా ప్రకటించడం అయోయయానికి గురి చేసింది.