Multiplex Champions Trophy: క్రికెట్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. మల్టీప్లెక్స్‌లలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్

విధాత: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. ఛాంపియన్స్ ట్రోఫీ భారత్, న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ ను మల్టీప్లెక్స్ లలో ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్, ఢిల్లీ, బెంగుళూర్, ఆహ్మదాబాద్, ముంబాయ్ వంటి దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోని మల్టీఫ్లెక్సీలలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ప్రసారానికి ఏర్పాట్లు చేసుకున్నారు.
ఇప్పటికే పలు మల్టీప్లెక్స్ లలో మ్యాచ్ కు సంబంధించి టికెట్ల బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. టీవీల్లో బుల్లి తెరపై చూసే మ్యాచ్ లను ఇక మల్టీప్లెక్స్ ల బిగ్ స్క్రీన్ పై సాటి అభిమానులతో కలిసి కేరింతల మధ్య ఎంజాయ్ గా వీక్షించవచ్చు. ఈ వినూత్న అనుభవం కోసం క్రికెట్ అభిమానులు ఆదివారం కోసం ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు. టికెట్ ధరలు రూ.295గా నిర్ణయించారు.
దీంతో క్రికెట్ అభిమానులు తమ అభిమాన టీమిండియా విజయాన్ని కాంక్షిస్తూ ఉత్సాహంగా బిగ్ స్క్రీన్ పై మ్యాచ్ చూసేందుకు ఎగబడుతున్నారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్లలో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. మ్యాచ్ మధ్యాహ్నం 1:30నుంచి దాదాపు ఎనిమిది గంటల పాటు జరుగనుండగా..మరి అంతసేపు మల్టీఫ్లెక్స్ థియేటర్లలో ఓపిగ్గా కూర్చోవడం మాత్రం కొంత కష్టమైనప్పటికి.. అభిమాన జట్టు విజయం కోసం వారు అందుకు సిద్ధమవుతున్నారు.