Indian Railway Ticket Rules | భారతీయ రైల్వే టికెట్ కొత్త రూల్స్.. అలా చేయకపోతే టికెట్ క్యాన్సిలే..!
Indian Railway Ticket Rules | ఏదైనా పర్యాటక ప్రాంతానికో లేదంటే.. సుదూర ప్రాంతానికి వెళ్లాల్సి వస్తే అందరూ రైలునే ఆశ్రయిస్తుంటారు. ప్రయాణానికి ముందే ముందస్తుగా టికెట్లను సైతం బుక్ చేసుకుంటారు. రైలు బెర్త్ కన్ఫర్మ్ అయితేనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం సాఫీగా సాగుతుంటుంది. లేకపోతే ఇబ్బందులు తప్పవు. అయితే, టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు సమయానికి రైలును అందుకోవడంలే ఏమాత్రం ఆలస్యమైనా ఇకపై టికెట్‌ను క్యాన్సిల్ చేసి మరో ప్రయాణికుడికి కేటాయించనున్నారు. ఈ మేరకు […]

Indian Railway Ticket Rules |
ఏదైనా పర్యాటక ప్రాంతానికో లేదంటే.. సుదూర ప్రాంతానికి వెళ్లాల్సి వస్తే అందరూ రైలునే ఆశ్రయిస్తుంటారు. ప్రయాణానికి ముందే ముందస్తుగా టికెట్లను సైతం బుక్ చేసుకుంటారు. రైలు బెర్త్ కన్ఫర్మ్ అయితేనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం సాఫీగా సాగుతుంటుంది. లేకపోతే ఇబ్బందులు తప్పవు.
అయితే, టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు సమయానికి రైలును అందుకోవడంలే ఏమాత్రం ఆలస్యమైనా ఇకపై టికెట్‌ను క్యాన్సిల్ చేసి మరో ప్రయాణికుడికి కేటాయించనున్నారు. ఈ మేరకు భారతీయ రూల్స్‌ను సవరించినట్లు తెలుస్తున్నది. ఎవరైనా ప్రయాణికుడు బోర్డింగ్ స్టేషన్‌లో రైలు ఎక్కాల్సి ఉంటుంది.
రైలు ప్రయాణం సమయంలో టీటీఈ టికెట్లను తనిఖీ చేస్తున్న సమయంలో సదరు ప్రయాణికుడు వారికి సంబంధించిన సీటులో కనిపించకపోతే.. అక్కడే కేవలం పది నిమిషాల వరకు వేచి చూస్తారు. ఆ తర్వాత ఇక ఆ ప్రయాణికుడు రాడని భావించి రికార్డుల్లో నమోదు చేసుకుంటారు. క్యాన్సిల్ చేసిన రైలు బెర్తును మరో ప్రయాణికుడికి కేటాయించనున్నారు.
ఇప్పటివరకు టీటీఈ పేపర్ లిస్ట్‌లో వారితో ఉన్న ప్రయాణికుల హాజరును గుర్తించేందుకు కేవలం రిజర్వేషన్ చార్ట్‌ను మాత్రమే చూసేవారు. ఈ క్రమంలో ప్రయాణికులు మరో స్టేషన్ వచ్చే వరకు వేచి ఉండే అవకాశం ఉండేది. అయితే, ఇప్పుడు టీటీఈలకు హ్యాండ్ హోల్డ్ టెర్మినల్స్‌ను భారతీయ రైల్వే అందుబాటులోకి తీసుకువచ్చింది.
దాంతో సదరు ప్రయాణికులు టికెట్లను తనిఖీ చేసున్న సమయంలో సదరు ప్రయాణికుడు వచ్చాడా? లేదా ? అనే వివరాలను ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు. టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ బోర్డింగ్ స్టేషన్ నుంచి రైలు ఎక్కిన వెంటనే బుక్ చేసుకున్న బెర్తుల వద్దకు చేరుకోవాలి. లేకుంటే టికెట్లను రద్దు చేసి మరో ప్రయాణికుడికి కేటాయించే అవకాశం ఉన్నది.
అయితే, కొద్దిసేపు మాత్రం వేచి చూసేందుకు అవకాశం ఉంటుంది. మరి ఎక్కువ సమయం గడిచిపోతే టికెట్‌ను క్యాన్సిల్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తున్నది. అత్యవసర సమయాల్లో ప్రయాణించే వారికి ఈ టికెట్లను కేటాయించేందుకు అవకాశం.
ఇందుకు అనుగుణంగా రన్నింగ్ రైలులో ఎక్కడ బెర్తులు ఖాళీగా ఉన్నాయో తెలుసుకునేందుకు రైల్వేశాఖ యాప్‌లో సైతం మార్పులు చేసింది. అలాగే, ఒక స్టేషన్‌లో రైలు ఎక్కేందుకు టికెట్‌ను బుక్ చేసుకొని మరో స్టేషన్‌లో ఎక్కేందుకు ఇకపై కుదరదు. ప్రయాణంలో ఎవరైనా మార్పులు జరిగితే వెంటనే బోర్డింగ్ స్టేషన్‌లో మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు.