IPL: గుడ్ న్యూస్.. ఉప్ప‌ల్‌ స్టేడియంలో VI 5G మొబైల్ సేవలు ప్రారంభం! దేశంలో మ‌రో 11 స్టేడియాల్లోనూ

  • By: sr    news    Apr 11, 2025 4:45 PM IST
IPL: గుడ్ న్యూస్.. ఉప్ప‌ల్‌ స్టేడియంలో VI 5G మొబైల్ సేవలు ప్రారంభం! దేశంలో మ‌రో 11 స్టేడియాల్లోనూ

IPL

హైదరాబాద్: దేశవ్యాప్తంగా IPL T20 క్రికెట్ ఉత్సాహం ఉరకలేస్తున్న సందర్భంలో, Vi (వొడాఫోన్ ఐడియా) హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో తన 5G సేవలను ప్రారంభించింది. క్రికెట్ ప్రియులు ప్రత్యక్ష మ్యాచ్‌ల ఉత్కంఠను ఆస్వాదిస్తూ అత్యంత వేగవంతమైన కనెక్టివిటీని అందుకునేలా, Vi తన నెట్‌వర్క్ సౌకర్యాలను బలోపేతం చేసి, స్టేడియంలో ఇబ్బందులు లేని 5G సేవలను అందిస్తోంది. వేలాది మంది ప్రేక్షకులు ప్రత్యక్ష మ్యాచ్‌ల కోసం రాజీవ్ గాంధీ స్టేడియంలో గుమిగూడే సమయంలో అధిక వేగ కనెక్టివిటీని నిర్ధారించడానికి, Vi అదనపు 5G నెట్‌వర్క్ సైట్‌లను ఏర్పాటు చేసింది. BTS, మాసివ్ MIMO వంటి సాంకేతికతలతో నెట్‌వర్క్‌ను మరింత బలపరిచింది.

ఎవరు ఉపయోగించవచ్చు?

5G సపోర్ట్ ఉన్న మొబైల్స్ కలిగిన Vi కస్టమర్లు, తమ మొబైల్ సెట్టింగ్స్‌లో 5G ఆప్షన్‌ను ఆన్ చేయడం ద్వారా స్టేడియంలో Vi 5G సేవల్ని పొందవచ్చు. క్రికెట్ అభిమానులకు Vi 5G సేవలను పరిచయం చేసేందుకు, దేశంలోని 11 ప్రముఖ స్టేడియంలలో వీఐ ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. వీటిలో ఈడెన్ గార్డెన్స్ (కోల్‌కతా), నరేంద్ర మోదీ స్టేడియం (అహ్మదాబాద్), ఎం. చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు), మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియం (చండీగఢ్), ఎం.ఎ. చిదంబరం స్టేడియం (చెన్నై), అరుణ్ జైట్లీ స్టేడియం (ఢిల్లీ), రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (హైదరాబాద్), సవాయి మాన్‌సింగ్ స్టేడియం (జైపూర్), ఎకానా స్టేడియం (లక్నో), వాంఖడే స్టేడియం (ముంబై), డాక్టర్ వై.ఎస్.ఆర్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియం (విశాఖపట్నం) ఉన్నాయి. అయితే స్టేడియానికి రాలేని వారు ఇంటి నుండి లేదా ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా Vi రీచార్జ్ ప్యాక్‌లతో మ్యాచ్‌ను ఆస్వాదించవచ్చు. రూ. 101 నుండి ప్రారంభమయ్యే ఈ ప్యాక్‌లు Jio Hotstar సబ్‌స్క్రిప్షన్‌తో పాటు అర్ధరాత్రి 12 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అపరిమిత డేటాను అందిస్తాయి.