Kurnool Accident| కర్నూలులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. కోటేకల్‌ వద్ద రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

Reported by: Y.V. Narsimha Reddy | వార్త‌లు | Nov 29, 2025, 10:49 am IST
Read Time: 1 mins
Kurnool Accident| కర్నూలులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

విధాత : కర్నూలు(Kurnool) జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన రోడ్డు ప్రమాదం(Road Accident)లో ఐదుగురు మృతి(five dead) చెందారు. కోటేకల్‌ వద్ద రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.

క్షతగాత్రులను ఆదోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను కర్ణాటకలోని కోలార్‌ జిల్లా చిన్న హోసపల్లికి చెందినవారిగా గుర్తించారు.