Mahindra Powerol: నంబర్ 1 జెన్‌సెట్ తయారీదారుగా.. మహీంద్రా పవరోల్

  • By: sr    news    May 30, 2025 7:06 PM IST
Mahindra Powerol: నంబర్ 1 జెన్‌సెట్ తయారీదారుగా.. మహీంద్రా పవరోల్

ముంబై, మే 27, 2025: మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్‌లోని పవరోల్ విభాగమైన మహీంద్రా పవరోల్‌కు 2024-25 ఆర్థిక సంవత్సరంలో (FY25) భారతదేశపు అగ్రశ్రేణి డీజిల్ జెన్‌సెట్ తయారీదారుగా గుర్తింపు లభించింది. ఫ్రాస్ట్ అండ్ సలివన్ తాజా డిజి ట్రాకర్ నివేదిక ప్రకారం, మహీంద్రా పవరోల్ భారతీయ జెన్‌సెట్ మార్కెట్‌లో 23.8% వాటాతో పరిమాణం పరంగా నంబర్ 1 స్థానాన్ని సాధించి, దీర్ఘకాలంగా మార్కెట్ లీడర్‌గా ఉన్న సంస్థను అధిగమించింది.

భారతీయ డీజిల్ జెన్‌సెట్ పరిశ్రమ FY25లో మొత్తం 1,51,634 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. అన్ని నాలుగు త్రైమాసికాల్లో నిలకడగా అద్భుతమైన పనితీరుతో మహీంద్రా పవరోల్ సహకారం, కంపెనీ వృద్ధిలో కీలక పాత్ర పోషించింది.

ఈ వృద్ధికి, సరికొత్త ఉద్గార నిబంధనలను పాటించేలా రూపొందించిన సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ IV+ (సీపీసీబీ4+) కంప్లైంట్ జెన్‌సెట్‌ల విక్రయాలు మద్దతు పలికాయి. అంతేకాకుండా, టెలికాం రంగంలో నిరంతర బలం కూడా దీనికి తోడైంది. ఈ రంగంలో మహీంద్రా పవరోల్ గత 15 సంవత్సరాలుగా 55% కన్నా ఎక్కువ మార్కెట్ వాటాను కలిగి ఉంది. కంపెనీ పోటీతత్వ రిటైల్ రంగంలో కూడా తన ఉనికిని విస్తరించింది, ఇది దాని పనితీరును మరింత పెంచింది.

మహీంద్రా పవరోల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, బిజినెస్ హెడ్ సంజయ్ జైన్ మాట్లాడుతూ, “భారత జెన్‌సెట్ మార్కెట్‌లో అగ్రగామిగా గుర్తించబడటం, ఆవిష్కరణలు, విశ్వసనీయత, వినియోగదారుల అవసరాలను తీర్చడంపై మా నిరంతర దృష్టిని తెలియజేస్తుంది. టెలికాం రంగంలో మా నాయకత్వం, రిటైల్ విభాగంలో విస్తరణ, సీపీసీబీ4+ నిబంధనలకి సిద్ధంగా ఉండటం ఈ ప్రయాణంలో కీలక పాత్ర పోషించాయి” అని అన్నారు. “మా భాగస్వాములకి, వినియోగదారులకి, దేశవ్యాప్తంగా ఉన్న బృందాలకి వారి నిరంతర విశ్వాసం, మద్దతుకి ధన్యవాదాలు. భారతదేశ పురోగతికి మద్దతుగా సమర్థవంతమైన, భవిష్యత్ అవసరాలను తీర్చగల విద్యుత్ పరిష్కారాలను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాం” అని ఆయన తెలిపారు.