మణిపూర్ లో మళ్లీ టెన్షన్

మణిపూర్ లో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొన్నది. గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న ఈ ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కుకీ, మైటీ వర్గీయులు ఘర్షణ పడ్డారు. మణిపూర్ రాజధాని ఇంపాల్ లోని క్వాకీథెల్ ప్రాంతంలో కాల్పులు వినిపించినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు.
శనివారం రాత్రి అరంబై టెంగోల్ సభ్యుడిని అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకున్నది. అరెస్ట్ ను నిరసిస్తూ ఆందోళన కారులు నిరసన తెలిపారు. కనన్ సింగ్ అరెస్టుకు వ్యతిరేకంగా యువకులు, మైటీ స్వచ్ఛంద సేవకులే నిరసనలకు దిగారు. జాతి ఘర్షణలు తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు తమ గ్రామాలపై దాడి చేశారని కుకీ వర్గం నేతలు ఆరోపిస్తున్నారు.
ఇంఫాల్‌లోని క్వాకీథెల్ ప్రాంతంలో కాల్పుల శబ్దం వినిపించిందని స్థానికులు తెలిపారు. మైటీ గ్రూప్ అరంబై టెంగోల్ నాయకుడిని అరెస్టు చేసిన తరువాత శాంతిభద్రతల సమస్యలను ఏర్పడే అవకాశం ఉందని మణిపూర్ ప్రభుత్వం శనివారం రాత్రి 11:45 గంటల నుంచి ఐదు రోజుల పాటు ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, తౌబాల్, బిష్ణుపూర్ మరియు కాక్చింగ్ ఐదు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది.