Rashi Phalalu | ఈ రోజు (మార్చి 29, శనివారం) మీ రాశి ఫలాలు! వారి మొండి బాకీలు వసూలవుతాయి

  • By: sr    news    Mar 29, 2025 9:02 AM IST
Rashi Phalalu | ఈ రోజు (మార్చి 29, శనివారం) మీ రాశి ఫలాలు! వారి మొండి బాకీలు వసూలవుతాయి

Horoscope | జ్యోతిషం, రాశి ఫ‌లాలు అంటే మ‌న తెలుగు వారికి ఏండ్ల త‌ర‌బ‌డి చెర‌గ‌ని నమ్మకం. లేచిన నుంచి నిద్రించే వ‌ర‌కు మంచే జరగాలని కోరుకుంటూ ఉంటాం. అందుకే రాశి ఫ‌లాల గురించి ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూ మ‌న ప‌నులు నిర్వ‌హిస్తూ ఉంటాం. దాని ప్ర‌కార‌మే న‌డుచుకుంటూ ఉంటాం కూడా. అందుకే నిద్ర లేవ‌గానే మొద‌ట చాలామంది వెతికేది వారికి ఆరోజు ఎలా ఉండ‌బోతుంద‌నే. అలాంటి వారంద‌రి కోసం మార్చి 29,  శనివారం రోజు వారి వారి పేర్ల మీద‌ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

 

మేషం (Aries) : వీరి ముఖ్యమైన పని పూర్తి. శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం. ప్రయాణాల వల్ల లాభం.పెళ్లి విషయంలో బంధువుల నుంచి శుభవార్తలు. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ధనచింత ఉండదు. విద్యార్థుల్లో పురోగతి సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆర్థికంగా పురోగతి. అన్నివిధాలా సుఖాలు పొందుతారు. ప్రయత్నకార్యాల్లో విజయం.
.
వృషభం (Taurus) : ఆకస్మిక ప్రయాణాలు. సంతృప్తికరంగా వ్యాపారాలు. తోటి వారితో విరోధం వ‌చ్చే అవ‌కాశం. వృత్తి, ఉద్యోగాలలో సానుకూల మార్పులు. వ్యాపారంలో ధననష్టం. వృధా ప్రయాణాలు అధికం. ఆర్థిక లావాదేవీలు, ఆదాయ ప్రయత్నాలు లాభిస్తాయి. కుటుంబ విషయాల్లో అనాసక్తి. స్త్రీలకు విశ్రాంతి అవసరం. వ్యక్తిగత సమస్యలు తగ్గిపోతాయి. కుటుంబ కలహాలకు తావీయరాదు. ఆకస్మిక ధననష్టం.

మిథునం (Gemini) : వీరికి వ్యక్తిగత సమస్య పరిష్కారం. ఎటువంటి ప్రయత్నమైనా సఫలం. రుణప్రయత్నాలు స‌ఫలం. కుటుంబంతో అసంతృప్తిక. మానసిక ఆందోళనలు. ఒకటి రెండు శుభ పరిణామాలు. స్త్రీలకు స్వల్ప అనారోగ్య స‌మ‌స్య‌లు. అదనపు ఆదాయ ప్రయత్నాలు కలిసి వస్తాయి.బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. సానుకూలంగా ఉద్యోగ జీవితం. ఊహించని కార్యాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో వృద్ధి. వృత్తి, వ్యాపారాల్లో సమస్యలు తగ్గుముఖం.

కర్కాటకం (Cancer) : ఈ రాశి వారికీ సజావుగా వృత్తి, వ్యాపారాలు. సంతృప్తికరంగా కుటుంబ పరిస్థితులు. ఆకస్మిక ధననష్టం. సాధారణంగా ఆర్థిక పరిస్థితి. అధిక వృధా ప్రయాణాలు. బంధు, మిత్రులతో క‌ల‌హాలు వ‌చ్చే అవ‌కాశం. వృత్తి, ఉద్యోగరంగాల్లో ఓపిక‌తో ఉండాలి. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో పనిభారం, ప్రోత్సాహకాలు.బంధుమిత్రుల వల్ల ఆర్థిక నష్టం అవ‌కాశం.

సింహం (Leo) : వీరికి మొండి బాకీలు వసూలవుతాయి.కొత్త‌ వ్యక్తులను నమ్మోద్దు. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు. దైవదర్శనానికి ప్రయత్నం. ఆశాజనకంగా ఆర్థిక వ్యవహారాలు. రుణప్రయత్నాలు ఆలస్యం. సోదరుల న‌డుమ‌ వైరం అవకాశం. స్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కోపం తగ్గించుకోవాలి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం. కఠిన మాట‌ల వల్ల స‌మ‌స్య‌లు. రావలసిన డబ్బు సకాలంలో చేతికి. వ్యాపారంలో క్షణం తీరిక ఉండ‌దు.

కన్య (Virgo) : వీరికి నిలకడగా వృత్తి, వ్యాపారాలు. సంతృప్తికరంగా కుటుంబ పరిస్థితులు. మానసిక ఆందోళన చెందుతారు. ప్రతిపని ఆలస్యం. తలపెట్టిన పనులు పూర్తి. వృత్తిరీత్యా జాగ్రత్త అవ‌స‌రం. ప‌లు విష‌యాల్లో విమర్శలు. ఆకస్మిక ధన లాభం. రుణబాధలుపోతాయి. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. పైస్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు. బంధువుల్లో పెళ్లి సంబంధం.

తుల (Libra) : వీరికి ఈ రోజు కుటుంబ సభ్యులతో కాలక్షేపం. ప్రయత్నం మేర లాభాలు. వృథా ప్రయాణాలు అధికం. వ్యాపారంలో మంచి లాభాలు. మిత్రుల వల్ల ఆర్థిక నష్టం. రుణప్రయత్నాలు చేస్తారు. కొత్త ప‌నుల‌కు శ్రీకారం. కుటుంబ ఖర్చులు బాగా పెరిగుతాయి. బంధు, మిత్రుల సహకారం ఆలస్యం. అనారోగ్యంతో బలహీనం. ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. ఉద్యోగంలో ప్రాధాన్యం. నిరుద్యోగులకు శుభవార్తలు.

వృశ్చికం (Scorpio) : వీరికి వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం. ఆర్థిక ఇబ్బందులతో సతమతం. పోట్లాటలకు దూరంగా ఉండాలి. అనారోగ్య స‌మ‌స్య‌లు తప్పవు. స్థిరాస్తుల విషయాల్లో జాగుర‌త‌గా ఉండాలి. ఆర్థిక రూపేణా వాగ్దానాలు చేయ‌వ‌ద్దు. కుటుంబంతో క‌లిసి దైవ కార్యాలు. ఉద్యోగ జీవితంలో బరువు బాధ్యతలు. ధైర్య సాహసాలు ఎక్కువ‌. బుద్ధి బ‌లంతో విజయాలు పొందుతారు. స్వల్ప అనారోగ్యం. ప్రయాణాలలో ఇబ్బందులు.

ధనుస్సు (Sagittarius) : వీరికి ఈ రోజు అదనపు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబంలో సంతోషంగా . గతంలో వాయిదా ప‌డిన‌ పనులు పూర్తి. సంపూర్ణ ఆరోగ్యం. ఉద్యో గాల్లో మంచి అవకాశా.లు స్థిర నివాసం ఉంటుంది. వ్యవసాయంలో లాభాలు. ప్రయత్న కార్యాలు స‌ఫలం. సూక్ష్మ విషయాలు గ్రహిస్తారు. ఆకస్మిక ధన నష్టం. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు. వృత్తి, వ్యాపారాల్లో వృద్ది.

మకరం (Capricorn) : వీరికి ఈ రోజు వ్యక్తిగత సమస్య పరిష్కారం. వ్యాపారంలో క్షణం తీరిక ఉండ‌దు. తలచిన కార్యాలన్నీ విజయవంతం. బంధు, మిత్రుల నుంచి మర్యాద మన్ననలు. సాఫీగా ఆరోగ్యం. సానుకూలంగా ఆర్థిక విషయాలు. సహ ఉద్యోగులకు సహకరిస్తారు. ప్రణాళికాబద్ధంగా ఆలోచనలు. అందరితో స్నేహంగా ఉండాలి. రాదనుకున్న డ‌బ్బు చేతికి వ‌స్తుంది. కుటుంబ కలహాలు తొల‌గుతాయి.వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ తగ్గుతుంది.

కుంభం (Aquarius) : ఈ రోజు ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు. సంతృప్తికరంగా కుటుంబ పరిస్థితులు. చాలా అంశాల్లో ఏపిక ప్ర‌ద‌ర్శించాలి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. బంధు, మిత్రులతో విరోధం అవ‌కాశం. అనవసర ధన వ్యయం. రుణప్రయత్నాలు ఎక్కువ‌. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. అనారోగ్య బాధలు. గౌరవ మర్యాదలకు లోపముండదు. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల లబ్ధి.

మీనం (Pisces) : ఈ రోజు ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సానుకూలం. కుటుంబంలో చిన్నచిన్న గొడవలకు అవ‌కాశం.ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక ఇబ్బందులు. రుణప్రయత్నాలు ఉంటాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం. బంధు, మిత్రుల సహాయసహకారాలు ఆలస్యం. తోటివారితో విరోధం అవ‌కాశం. వ్యాపారంలో ధననష్టం. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు. నూత‌న గృహ, వాహన ప్రయత్నాలు సఫలం. లాభసాటిగా వ్యాపారాలు.