అనంతయ్య కరోనా మందును ప్రభుత్వమే పంపిణీ చేయాలని జాతీయ బిసి జెఎసి కన్వీనర్ వలిగట్ల రెడ్డప్ప డిమాండ్

కరోనా నివారణకు వన మూలికలతో కృష్ణపట్నం అనంతయ్య యాదవ్ తయారు చేసిన మందును ప్రభుత్వమే ప్రజలందరికీ ఉచితంగా పంపిణీ చేయాలని జాతీయ బిసి జెఎసి కన్వీనర్ వలిగట్ల రెడ్డప్ప డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన బొణిగి ఆనందయ్య యాదవ్ గారు గత దశాబ్దాలుగా ఆయుర్వేదం పై పట్టతో అనేక ధీర్ఘకాల వ్యాధులకు మందులు తయారు చేసి పేదలకు ఉచితంగా సేవలు చేస్తున్నారు. తాను తయారు చేసిన మందుపై దేశ వ్యాప్తంగా ప్రజల్లో మంచి ఆదరణ, […]

అనంతయ్య కరోనా మందును ప్రభుత్వమే పంపిణీ చేయాలని జాతీయ బిసి జెఎసి కన్వీనర్ వలిగట్ల రెడ్డప్ప డిమాండ్

కరోనా నివారణకు వన మూలికలతో కృష్ణపట్నం అనంతయ్య యాదవ్ తయారు చేసిన మందును ప్రభుత్వమే ప్రజలందరికీ ఉచితంగా పంపిణీ చేయాలని జాతీయ బిసి జెఎసి కన్వీనర్ వలిగట్ల రెడ్డప్ప డిమాండ్ చేశారు.

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన బొణిగి ఆనందయ్య యాదవ్ గారు గత దశాబ్దాలుగా ఆయుర్వేదం పై పట్టతో అనేక ధీర్ఘకాల వ్యాధులకు మందులు తయారు చేసి పేదలకు ఉచితంగా సేవలు చేస్తున్నారు.

తాను తయారు చేసిన మందుపై దేశ వ్యాప్తంగా ప్రజల్లో మంచి ఆదరణ, విశ్వసనీయత ఉందన్నారు.

తాను తయారు చేసిన మందు వల్ల ఎలాంటి దుష్ఫలితాలు లేవని ఇప్పటికే ఆయుష్‌ బృందం నిర్ధరించిందని తెలిపారు.

ఐసీఎంఆర్‌ వాళ్లు కూడా వచ్చి మందును పరిశీలిస్తాన్నారు.

ఆ తర్వాత అనుమతులు వచ్చాన రాకపోయినా కరోనా రోగులకుకు మంచి ఔషధంగా పనిచేస్తుంది కాబట్టి పంపిణీ చేయాలనే జాతీయ బిసి జెఎసి కన్వీనర్ వలిగట్ల రెడ్డప్ప డిమాండ్ చేశారు.

అనందయ్య ఆయుర్వేద మందుపై ఎటువంటి ఆరోపణలు తగవని, అనుమానాలు కూడా సరికాదని ఆయన అన్నారు. అసత్యాలతో ఆరోపణలు చేస్తున్న వారికి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చేలోగా మందుకు విస్తృతంగా పంపిణీ చేయడానికి సంబంధించిన మూలికల సేకరణలో ఆనందయ్య రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన నిధులు సమకూర్చాలి.
ఎందుకంటే ప్రపంచంలో ఏక్కడా లేని మెడికల్ మాఫియా మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది. అనంతయ్య మందుతో కరోనా కట్టడి అయితే వారి వ్యాపారాలకు అడ్డకట్టబడుతుంది. కాబట్టి ఒక వైపు కార్పొరేట్ ఆసుపత్రులు , మరో వైపు ఫార్మా మాఫియా అనంతయ్య మందుపై ఇప్పటికే అసత్య ప్రచారాలు మొదలు పెట్టారు.

అవసరం అయితే అనంతయ్య మందును ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశీలను కేంద్ర ప్రభుత్వం పంపాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్పొరేట్ ఆసుపత్రుల ఓత్తిళ్ళకు తలగ్గొకుండా అనంతయ్య మందును ప్రభుత్వమే అవసరమైన ఔషధాలు అందించి పేద ప్రజల ప్రాణాలు నిలబెట్టడానికి ఉచితంగా పంపిణీ చేయాలని జాతీయ బిసి జెఎసి కన్వీనర్ వలిగట్ల రెడ్డప్ప డిమాండ్ చేశారు.