Baby Thrown On The Road| అప్పుడే పుట్టిన బిడ్డను రోడ్డు పాలు చేశారు!

ఖిలాషాపూరులో పసికందు కలకలం
మగ బిడ్డను వదిలి వెళ్ళిన గుర్తుతెలియని వ్యక్తులు
విధాత, వరంగల్ ప్రతినిధి: జనగామ జిల్లా రఘునాథ పల్లి మండలం ఖిలాషాపురం గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన పసికందును టవల్లోచుట్టి రోడ్డుపై వదిలేసిన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. బుధవారం తెల్లవారు జామున పసిపాప ఏడుపు వినిపిస్తుండటంతో గమనించిన గ్రామస్తులు వెళ్లి చూడగా..అప్పుడే పుట్టిన మగశిశువు వస్త్రంలో చుట్టి ఉండటం కనిపించింది. చుట్టూ పక్కల ఎవరూ లేకపోవడంతో రోడ్డుపైనే ఉన్న చిన్నారిని చూసి ఆందోళన వ్యక్తం చేసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఏ కసాయి తల్లి నిర్వాకమే ఇది అంటూ స్థానికులు ఆ చిన్నారిన దీన స్థితిని చూసి ఆవేదన చెందారు.
పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని శిశువును ఛైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించారు. ప్రస్తుతం జనగామ ఎంసీహెచ్‌లో శిశువుకు చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎవరో బిడ్డను ఉద్దేశపూర్వకంగానే అక్కడ వదిలి వెళ్ళినట్టు భావిస్తున్నారు. ఏ కసాయి తల్లి నిర్వాకమే ఇది అంటూ స్థానికులు ఆ చిన్నారిన దీన స్థితిని చూసి ఆవేదన చెందారు.