భూమా అఖిలప్రియ భర్త, సోదరుడిపై మరో కేసు

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త, సోదరుడిపై మరో కేసు నమోదైంది. నకిలీ కొవిడ్‌ సర్టిఫికెట్‌ సమర్పించారని బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో భార్గవ్‌రామ్‌, జగత్‌ విఖ్యాత్‌పై కేసు నమోదు చేశారు. బోయిన్‌పల్లిలో ప్రవీణ్‌రావు సోదరుల కిడ్నాప్‌ కేసులో వీరిద్దరూ ఈ నెల 3న కోర్టులో హాజరు కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా విచారణకు హాజరుకాలేమని ఈ నెల 1న కోర్టులో నకిలీ ధ్రువపత్రం సమర్పించినట్లు అభియోగం నమోదైంది. దీంతో బోయిన్‌పల్లి పోలీసులు వీరు సమర్పించిన […]

  • Publish Date - July 7, 2021 / 05:09 AM IST

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త, సోదరుడిపై మరో కేసు నమోదైంది. నకిలీ కొవిడ్‌ సర్టిఫికెట్‌ సమర్పించారని బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో భార్గవ్‌రామ్‌, జగత్‌ విఖ్యాత్‌పై కేసు నమోదు చేశారు. బోయిన్‌పల్లిలో ప్రవీణ్‌రావు సోదరుల కిడ్నాప్‌ కేసులో వీరిద్దరూ ఈ నెల 3న కోర్టులో హాజరు కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా విచారణకు హాజరుకాలేమని ఈ నెల 1న కోర్టులో నకిలీ ధ్రువపత్రం సమర్పించినట్లు అభియోగం నమోదైంది. దీంతో బోయిన్‌పల్లి పోలీసులు వీరు సమర్పించిన కొవిడ్‌ సర్టిఫికెట్లను పరిశీలించారు. ధ్రువపత్రం ఇచ్చిన ఆస్పత్రికి వెళ్లి విచారించగా.. నకిలీ సర్టిఫికెట్‌ జారీ చేసినట్లు గుర్తించారు. నకిలీ ధ్రువపత్రం ఇచ్చిన ముగ్గురు ఆస్పత్రి సిబ్బందిపైనా కేసు నమోదు చేశారు.