రేపటికల్లా ఆత్మకూరుకు ఆక్సిజన్.. మంత్రి గౌతమ్ రెడ్డి

విధాత‌: రేపటికల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి అవసరమైన వెంటిలేటర్లను విశాఖలోని మెడ్ టెక్ జోన్ నుంచి తెప్పిస్తున్న పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. రెమెడిసివర్ ఇంజక్షన్ ల సరఫరా గురించి జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుతో ఫోన్లో మాట్లాడారు. జిల్లాలోని కోవిడ్ ఆసుపత్రులైన జిజిహెచ్, నారాయణ, అపోలో సహా పలు ఆసుపత్రులలో అందుతున్న వైద్య సేవల‌పై మంత్రి ఆరా తీశారు. ప్ర‌జలకు పారదర్శకంగా నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూడాలని జిల్లా కలెక్టర్, అధికారుల‌ను ఆదేశించారు. […]

  • Publish Date - May 6, 2021 / 12:27 PM IST

విధాత‌: రేపటికల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి అవసరమైన వెంటిలేటర్లను విశాఖలోని మెడ్ టెక్ జోన్ నుంచి తెప్పిస్తున్న పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. రెమెడిసివర్ ఇంజక్షన్ ల సరఫరా గురించి జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుతో ఫోన్లో మాట్లాడారు.

జిల్లాలోని కోవిడ్ ఆసుపత్రులైన జిజిహెచ్, నారాయణ, అపోలో సహా పలు ఆసుపత్రులలో అందుతున్న వైద్య సేవల‌పై మంత్రి ఆరా తీశారు. ప్ర‌జలకు పారదర్శకంగా నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూడాలని జిల్లా కలెక్టర్, అధికారుల‌ను ఆదేశించారు. అనంత‌రం ఆత్మకూరు ఆర్డీవో చైత్ర వర్షినితో ఫోన్లో మాట్లాడి క‌రోనా బాధితుల‌కు అందుతున్న సేవ‌ల‌ను తెలుసుకున్నారు.