విధాత(ప.గో.): ప్రశాంతతకు నిలయం పశ్చిమగోదావరి జిల్లా.. ఇలాంటి ప్రాంతంలో ఒక చీడపురుగుని ఎంపీగా ఎన్నుకున్నామని ప్రజలు సిగ్గుపడుతున్నారని ఏపీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు వ్యాఖ్యానించారు. శనివారం తాడేపల్లిగూడెంలో ఆయన మాట్లాడారు.
రఘురామకృష్ణంరాజు 14 నెలలు నుంచి ఢిల్లీలో కూర్చుని తనను గెలిపించిన ప్రజలను గాలికొదిలేశారు. కనీసం వారి బాగోగులు పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రజల మనోభావాలు, ఆచారాలు రఘురామకృష్ణరాజుకు అవసరం లేదు. అలాంటి వారికి గుణపాఠం అవసరం. అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీని అరెస్టు చేయడం సరికాదంటున్న ప్రతిపక్ష పార్టీలు తీరు సరికాదు. అసలు ప్రతిపక్ష పార్టీలకు రఘురామకృష్ణరాజు మీద ఎందుకు అంత ప్రత్యేక శ్రద్ధ.