Pooja Hegde | ఆ హీరోయిన్ దెబ్బకి.. పూజా హెగ్డేకు మెంటలెక్కిపోతోంది
Pooja Hegde | కొత్త నీరు వచ్చి పాతనీరు కొట్టుకుపోయిందనే చందాన ఉందా ఇద్దరు హీరోయిన్ల సంగతీ. కొత్తగా ఏ హీరోయిన్ ఇండస్ట్రీకి పరిచయం అయినా అమాంతంగా పైకి ఎత్తేయడమో.. లేదా ఐరెన్ లెగ్ అంటూ పాతాళానికి తొక్కేయడమో చూస్తూనే ఉంటాం. కానీ.. ఇక్కడ ఇద్దరి హీరోయిన్ల మధ్య మంట రాజుకుంటుంది. దర్శకేంద్రడు రాఘవేంద్రరావు ఈమధ్య కాలంలో తీసిన సినిమా పెళ్ళిసందD. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శ్రీలీల. తన అందచందాలతోనే కాదు. చక్కని నటన, […]

Pooja Hegde |
కొత్త నీరు వచ్చి పాతనీరు కొట్టుకుపోయిందనే చందాన ఉందా ఇద్దరు హీరోయిన్ల సంగతీ. కొత్తగా ఏ హీరోయిన్ ఇండస్ట్రీకి పరిచయం అయినా అమాంతంగా పైకి ఎత్తేయడమో.. లేదా ఐరెన్ లెగ్ అంటూ పాతాళానికి తొక్కేయడమో చూస్తూనే ఉంటాం. కానీ.. ఇక్కడ ఇద్దరి హీరోయిన్ల మధ్య మంట రాజుకుంటుంది.
దర్శకేంద్రడు రాఘవేంద్రరావు ఈమధ్య కాలంలో తీసిన సినిమా పెళ్ళిసందD. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శ్రీలీల. తన అందచందాలతోనే కాదు. చక్కని నటన, చురుకైన డాన్స్‌తో ప్రేక్షకుల మదిని కొల్లగొట్టి.. టాలీవుడ్ టాప్ ఛైర్ కోసం దూసుకెళుతోంది. నటనలో టాలెంట్ సంగతి అటుంచి, రెండు హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.
దీంతో అందంగా, చురుగ్గా ఉన్న ఈ కుర్ర హీరోయిన్‌ని ‘మా సినిమాలో అంటే.. మా సినిమాలో పెట్టు కోవాలని’ నిర్మాతలు వరుసగా క్యూ కడుతున్నారు. అంతా బాగానే ఉంది కానీ.. పాపం ఆ అమ్మడు దూకుడు ఓ హీరోయిన్‌కి అస్సలు నచ్చడం లేదట. పైగా భారీ ఛాన్స్‌లు వదులుకునేలా చేస్తుందట. ఆ హిట్ హీరోయిన్ శ్రీలీల మీద గుర్రుగా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇంతకీ ఆమె ఎవరో కాదు. తెలుగు సినిమా ఇండస్టీలో స్టార్ హీరోయిన్ స్థానాన్ని తక్కువ సమయంలోనే దక్కించుకున్న పూజా హెగ్డే. శ్రీలీల కారణంగా ఆమెకు మొండి చేయి చూపిస్తున్నారట దర్శక నిర్మాతలు. ఒకప్పుడు పూజా డేట్స్ కోసం ఎగబడిన వాళ్ళే.. ఇప్పుడు రూటు మార్చేసి శ్రీలీల వైపుకు మళ్ళారట. పాపం చిన్న సినిమా అయితే లైట్ తీసుకునేదేమోగానీ.. రెండు భారీ ప్రాజెక్ట్స్ చేజారి పోవడాన్ని జీర్ణించుకోలేక పోతుందట.
అసలు విషయం ఏమిటంటే.. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘గుంటూరు కారం’ సినిమాలో మొదట కథానాయికగా పూజానే అనుకున్నారు. అయితే స్క్రిప్ట్‌లో చిన్న చిన్న మార్పుల తరవాత షెడ్యూల్ వర్క్ మొదలయ్యే నాటికి, ఏకంగా ఇప్పుడు హీరోయిన్నే మార్చేసి, పూజా స్థానంలో మెయిన్ హీరోయిన్‌గా శ్రీలీలను తీసుకుని, ఆమె స్థానాన్ని సెకండ్ హీరోయిన్ స్థాయికి దించేయడంతో, మింగుడు పడక.. పాపం మొత్తం ప్రాజెక్ట్ నుంచే తప్పుకుందట పూజా. ఇదేనా.. పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలోనూ శ్రీలీల కారణంగా చుక్కెదురే అయింది పూజాకి. ఈ సినిమాలో కూడా శ్రీలీల నటిస్తుందని తెలిసి తనే తప్పుకుందట.
‘అల వైకుంఠ పురములో’ సినిమాతో తన నటనకు పట్టం కట్టిన ఈ జనాలే తనను చిన్న చూపు చూస్తున్నారనే ఈగోతో చేతిలో ఉన్న సినిమాలను వరుసగా వదులుకుంటూ వస్తుంది పూజా హెగ్డే. ఇలాంటి ధోరణి పతనానికే కానీ సక్సెస్‌కు తోడవదనేది సినీ జనాల అభిప్రాయం. శ్రీలీల మీద ఈగోకి పోకుండా తన కెరియర్ మీద దృష్టిపెడితే మరో ఐదేళ్ళన్నా తెలుగు తెరమీద మెరుస్తుంది పూజా. లేదంటే తెరమరుగు కావడం ఖాయం అంటున్నారు సినీ విమర్శకులు.