Bellamkonda Suresh: అన్ని సెట్టయ్యాయి.. వచ్చే ఏడాది మా వాడి పెళ్లి

విధాత: టాలీవుడ్‌లో ఈ సంవత్సరం టాలీవుడ్ హీరో, హీరోయిన్లకు బాగా కలిసొచ్చినట్లుగా ఉంది. ఒకరి తర్వాత ఒకరు పెళ్లిపీటలు ఎక్కుతూ సర్‌ప్రైజ్ చేస్తున్నారు. ఇప్పటికే కిరణ్ అబ్బవరం- రహాస్య గోరక్, సిద్దార్థ్- అదితి రావ్ సింగర్స్ అనురాగ్ కులకర్ణి- రమ్య బెహార, సుబ్బరాజు, తాజాగా నాగ చైతన్య, శోభిత దూళిపాళ్ల పెళ్లి పీటలు ఎక్కగా త్వరలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ లిస్టులో చేరేందుకు రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
అల్లుడు శీను సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన శ్రీనివాస్ కెరీర్‌లో మంచి విజయాలతో ప్రస్తుతం చేతినిండా సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆయన తండ్రి ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ మాట్లాడుతూ.. మా పెద్దబ్బాయి శ్రీను లైఫ్ సెట్ అయిపోయింది నాలుగైదు సినిమాలు చేస్తు బిజీగా ఉన్నాడని, జనవరిలో భైరవ రిలీజ్ అవుతుందని, అదే సంవత్సరం మరో రెండు చిత్రాలు కూడా విడుదల అవుతాయన్నారు.
త్వరలో నేను కూడా మా అబ్బయిలిద్దరితో సినిమాలు తీస్తా అని అన్నారు. ఇక 2025లో మావాడి పెళ్లి ఉంటుందని దాదాపు అన్ని సెట్టాయ్యాయని, త్వరలో ప్రకటిస్తానని స్ఫష్టం చేశాడు. దీంతో వచ్చే సంవత్సరం కూడా టాలీవుడ్‌లో చాలానే శుభకార్యాలు ఉండనున్నాయని నెటిజన్లు భావిస్తున్నారు.