కరోనా వచ్చిందని బాత్రూంలో క్వారంటైన్

విధాత:మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పురపాలక పరిధిలోని గోదావరిరోడ్డులో ఓ మహిళ కరోనా బారిన పడింది. కుటుంబసభ్యులు తమకు వైరస్ సోకకూడదని… ఇంట్లో నాలుగు గదులు ఉన్నా… ఆమెను స్నానాల గదికి పరిమితం చేశారు. ఆరు రోజులుగా ఆమె పడుతున్న ఇబ్బందులను గమనించిన పొరుగువాళ్లు స్థానిక ఎస్సై చంద్రశేఖర్​ దృష్టికి తీసుకెళ్లారు.స్పందించిన ఎస్సై బాధితురాలి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులకు నచ్చజెప్పారు. ఇంట్లో ఇబ్బందిగా ఉంటే బెల్లంపల్లిలోని కొవిడ్​ ఐసోలేషన్​ కేంద్రానికి తరలించాలని సూచించారు. బాధితురాలు అంగీకరించకపోవడంతో… ఇంట్లోని ఓ […]

కరోనా వచ్చిందని బాత్రూంలో క్వారంటైన్

విధాత:మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పురపాలక పరిధిలోని గోదావరిరోడ్డులో ఓ మహిళ కరోనా బారిన పడింది. కుటుంబసభ్యులు తమకు వైరస్ సోకకూడదని… ఇంట్లో నాలుగు గదులు ఉన్నా… ఆమెను స్నానాల గదికి పరిమితం చేశారు. ఆరు రోజులుగా ఆమె పడుతున్న ఇబ్బందులను గమనించిన పొరుగువాళ్లు స్థానిక ఎస్సై చంద్రశేఖర్​ దృష్టికి తీసుకెళ్లారు.
స్పందించిన ఎస్సై బాధితురాలి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులకు నచ్చజెప్పారు. ఇంట్లో ఇబ్బందిగా ఉంటే బెల్లంపల్లిలోని కొవిడ్​ ఐసోలేషన్​ కేంద్రానికి తరలించాలని సూచించారు. బాధితురాలు అంగీకరించకపోవడంతో… ఇంట్లోని ఓ గది ఖాళీ చేయించి అందులో ఆమెకు ఉండేందుకు ఏర్పాట్లు చేయించారు.