Madhavan: ముంబై, దుబాయ్‌లలో.. ఆస్తులు కొనుగోలు చేసా

ప్రముఖ నటుడు ఆర్. మాధవన్‌ తన సినిమాల సంపాదనను రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడులలో మలచుకున్నట్టు తెలిపారు. అలాగే, దుబాయ్‌లో తనకు లగ్జరీ షిప్‌ ఉందన్న రూమర్స్‌పై క్లారిటీ ఇస్తూ – నిజానికి తనకు రూ.16 కోట్లు విలువైన చిన్న బోటే ఉందని స్పష్టం చేశారు.

  • By: raj    news    Oct 03, 2025 5:29 PM IST
Madhavan: ముంబై, దుబాయ్‌లలో.. ఆస్తులు కొనుగోలు చేసా

ఆర్. మాధవన్‌ రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడులపై ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రముఖ నటుడు ఆర్‌.మాధవన్‌ (Madhavan) తన కెరీర్‌లో సంపాదించిన డబ్బును సినిమాలకే పరిమితం చేయకుండా, రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడులుగా పెట్టినట్టు వెల్లడించారు. ఈ పెట్టుబడులే ఇప్పుడు తనను బలంగా ఆదుకుంటున్నాయని ఆయన ఒక తాజా ఇంటర్వ్యూలో చెప్పారు.

మాధవన్‌ మాట్లాడుతూ – “సినిమాల ద్వారా సంపాదించిన మొత్తంలో కొంత భాగాన్ని ముంబై, దుబాయ్‌లో ఆస్తులు కొనుగోలు చేసాను. అలాగే రియల్‌ ఎస్టేట్‌లో పెట్టిన డబ్బు ఇప్పుడు నాకు ఆర్థికంగా ఎంతో ఉపశమనం కలిగిస్తోంది” అని తెలిపారు.

అదే సమయంలో, మీడియాలో వస్తున్న కొన్ని రూమర్స్‌పై కూడా క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా – “దుబాయ్‌లో నాకు ఒక లగ్జరీ షిప్‌ ఉందంటూ ప్రచారం జరుగుతోంది. కానీ, దాంట్లో ఏమాత్రం నిజం లేదు. నాకు ఉన్నది ఒక చిన్న బోటే. ఆ పడవ విలువ సుమారు రూ.16 కోట్లు. అదే లగ్జరీ షిప్‌ అని ప్రచారం చేస్తున్నారు. కానీ వాస్తవం వేరు” అని స్పష్టం చేశారు.

సినిమా రంగంలో సక్సెస్‌ సాధించిన మాధవన్‌, ఇప్పుడు వ్యాపార రంగంలో కూడా తెలివిగా పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతున్నాడనే విషయం ఈ ఇంటర్వ్యూతో మరోసారి బయటపడింది.